ఇల్లాలిని పుట్టింటికి పంపి.. ప్రియురాలితో కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?

Update: 2022-10-13 10:30 GMT
ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాళ్లను పెట్టి హీరో పడే బాధలు థియేటర్ లో చూశాక కూడా ఈ మగాళ్ల బుద్ది మారడం లేదు. కోరి మరీ పెళ్లాలు, ప్రియురాళ్లతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు.తాజాగా ఓ మొగుడు ఇల్లాలిని పుట్టింట్లో వదిలి ప్రియురాలితో టూర్లు వేశాడు. పైగా ఆ ఫొటోలను భార్యకే పంపించాడు ఆ ఘనుడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తాడోనని మగపుంగవులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటివి చూసి  ఇల్లాలు అయితే మొగడు తాటతీస్తుంది.. విడాకులకైనా వెళుతుంది. కానీ ఆ ఫొటోలు చూసిన ఆ ఇల్లాలు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.

కర్ణాటకలోని హోణ్ణూరు కదిరెనహళ్లిలో నివసించే మునిరాజు, దేవమ్మల కూతురు మోనికకు, చిక్కబళ్లాపురంలో నివసించే భార్గవ్ కు ఇచ్చి 8 నెలల క్రితం ఘనంగా వివాహం చేశారు.

మోనిక, భార్గవ్ లు అన్యోన్యంగానే ఉండేవారు. దసరాకు భార్యను ఆమె పుట్టింటికి పంపించాడు. అనంతరం మళ్లీ ఆమెను తీసుకెళ్లడానికి రాలేదు. తన భర్త వస్తాడని..  వచ్చి తీసుకెళ్తాడని మోనిక ఎదురుచూసింది. కానీ అతడు రాలేదు. ఫోన్ చేసి నన్ను తీసుకెళ్లు అని భర్త భార్గవ్ ను అడిగితే అతడు పట్టించుకున్న పాపాన పోలేదు.

మరో యువతితో షికార్లు చేస్తున్న ఫొటోను బుధవారం అతడు భార్య మోనికకు పంపించాడు. ఆ ఫొటోలు చేసిన ఆమె తీవ్ర ఆవేదన చెందింది. తన భర్త చేసిన పనికి తీవ్ర కలత చెందిన మోనిక ఇంటిపై ఉన్న గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకుంది.

తన చావుకు భర్త భార్గవ్ కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తమ కూతురి జీవితాన్ని నాశనం చేసిన భార్గవ్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News