హుజురాబాద్ ఉప ఎన్నిక పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ , ఆరోగ్యశాఖ మంత్రి గా విశేషంగా సేవలు అందించిన ఈటెల , మంత్రి పదవితో పాటుగా ఎమ్మెల్యే పదవి కి కూడా రాజీనామా చేసి బీజేపీ లో చేరి ఉప ఎన్నిక కి తెర తీశారు. ఈ ఎన్నికలని అటు టిఆర్ ఎస్ ప్రభుత్వం , ఇటు బీజేపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తో ఈ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనితో ఆ నియోజకవర్గం లో నిఘా కట్టు దిట్టం చేసింది అధికార యంత్రాంగం. ఏకంగా 1900 మంది బలగాల తో బందో బస్తు ఏర్పారు చేశారు అధికారులు.
అంతే కాదు అతి త్వరలోనే 120 సెక్షన్ ల కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి. బ్ల్యు కోట్స్,పెట్రో కారులతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టనున్నారు పోలీసులు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. నాలుగు మండలాలలో 406 సిసి కెమెరాలు ఏర్పాటు ఏర్పాటు చేశారు. హుజురాబాద్ లో 110,జమ్మికుంటలో 169,వీణవంక లో 87,ఇల్లందకుంటలో 36 కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఇక ఇప్పటి వరకు 12 రోజుల్లో కోటి 27 లక్షల నగదు పట్టుబడినట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడు లక్షల విలువైన మద్యం, గంజాయి, జిలేటిన్ స్టిక్స్ డిటోనేటర్లు,75 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు ఎన్నికల ఉల్లంఘన ఘటనల్లో 33 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ కాకుండా 24 గంటలు రెండు సైబర్ క్రైమ్ టీమ్స్ నిఘా పెట్టారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు ఇటీవల నామినేషన్లు వేశారు. తాజాగా అధికారులు వాటి పరిశీలన చేపట్టారు. 61 నామినేషన్లలో 19 తిరస్కరించారు. ఉప ఎన్నిక బరిలో ప్రస్తుతం 42 మంది అభ్యర్థులు ఉన్నారు. నేటి వరకునామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. దీంతో ఈ రోజు ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. నామినేషన్ల ఘట్టంలో కీలకమైన గుర్తుల కేటాయింపుల ప్రక్రియ కూడా నేడు సాయంత్రం జరగనుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్న 42 మంది అభ్యర్థుల్లో ఎంతమంది ఉపసంహరణ దిశగా అడుగులు వేస్తారనేది కూడా ఇవ్వాళ తేలనుంది. ఉపసంహరణకు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. ఈలోగా ఇదివరకే నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలంటే నేరుగా వచ్చి సంతకం పెట్టి నామపత్రాల్ని తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ముగ్గురితో పాటు 32 మంది స్వతంత్రులు, ఏడుగురు ఇతరపార్టీల సభ్యులు ఉప ఎన్నికల బరిలో ఉన్నారు.
ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపి నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ తరఫున నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం నాయకుడు బల్మూరి వెంకట్ బరిలో ఉన్నారు.