ఆ జాబితాలో హైద‌రాబాద్ - పుణె టాప్!

Update: 2018-03-21 14:37 GMT
దేశంలోని ప్రఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతాల‌లో ఒక‌టైన హైద‌రాబాద్ శిగ‌లో మ‌రో కిరీటం చేరింది. విశ్వ‌న‌గ‌రంగా పేరు గాంచి శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాగ్య‌న‌గ‌రానికి మ‌రో అరుదైన ఘ‌న‌త ద‌క్కింది. దేశంలో నివ‌సించ‌డానికి ఆమోద‌యోగ్య‌మైన నాణ్య‌మైన న‌గ‌రాల‌లో హైద‌రాబాద్ అగ్ర‌స్థానంలో నిలిచింది. తాజాగా, భార‌త్ `మెర్సెర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్-2018` జాబితాలో హైద‌రాబాద్ ప్ర‌థ‌మ స్థానం ద‌క్కించుకుంది. వ‌రుస‌గా నాలుగో ఏడాది హైద‌రాబాద్ అగ్ర‌స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషం. అయితే, ఈ ఏడాది హైద‌రాబాద్ తో పాటు పుణె కూడ సంయుక్తంగా అగ్ర‌స్థానంలో నిలిచింది.

క్రైమ్ రేట్ త‌క్కువ‌గా ఉండ‌డం, నివాస‌యోగ్య‌మైన, ఆహ్లాద‌క‌ర‌మైన‌ వాతావ‌ర‌ణం ....వంటి అంశాలు హైద‌రాబాద్ ను అగ్ర‌స్థానంలో నిల‌బెట్టాయి. మంచి సౌక‌ర్యాల‌తో ఇళ్లు దొర‌క‌డం, అంత‌ర్జాతీయ ఉద్యోగుల‌కు మంచి గృహోప‌ర‌క‌ర‌ణాలు అందుబాటులో ఉండ‌డం వంటి అంశాలు పుణెను ప్ర‌థ‌మ స్థానంలో నిలిపాయి. అయితే, దేశ రాజ‌ధాని ఢిల్లీ.... ఈ జాబితాలో వ‌రుస‌గా మూడో ఏడాది అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. అక్క‌డ ట్రాఫిక్ చిక్కులు, వాతావ‌ర‌ణ‌, వాయు కాలుష్యం వంటి అంశాలతో ఢిల్లీకి అట్ట‌డుగు స్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైతో పాటు కోల్ క‌తా, చెన్నై, బెంగ‌ళూరు లు హైద‌రాబాద్ - పుణె ల క‌న్నా దిగువ స్థానాల‌తో స‌రిపెట్టుకున్నాయి. మ‌రోవైపు, ప్ర‌పంచ‌ `మెర్సెర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్-2018` జాబితాలో వియ‌న్నా వ‌రుస‌గా తొమ్మిదో ఏడాది ప్ర‌థ‌మ స్థానం ద‌క్కించుకుంది. ఆసియా `మెర్సెర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్-2018`జాబితాలో సింగ‌పూర్ అగ్ర‌స్థానంలో ఉంది.
Tags:    

Similar News