అర్థరాత్రి పూట రోడ్ల మీద తిరుగుతూ.. బైకుల మీద వెర్రివేషాలు వేస్తూ.. రోడ్ల మీద వెళ్లే వారిని భయభాంత్రులకు గురి చేయటం.. తమకు కనిపించిన వారిని మాటల దాడితో పాటు.. మహిళలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే వారిని గుర్తించేందుకు హైదరాబాద్ లో శుక్రవారం అర్థరాత్రి ‘‘అపరేషన్ మిడ్ నైట్ రోమియోస్’’ పేరిట తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు.
పాతబస్తీలో చేపట్టిన ఈ ఆపరేషన్ లో పలువురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ మొత్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో దాదాపు 31 మంది రోమియోలను అదుపులోకి తీసుకున్నారు. వీరి తల్లిదండ్రుల్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇలాంటి ఆపరేషన్ లు వీలైనన్ని ఎక్కువగా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తే.. ఫలితం ఉంటుంది. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారికి సంబంధించి ఒక రికార్డు బుక్ ను ఓపెన్ చేసి అందులో వీరి వివరాల్ని నమోదు చేయటం ద్వారా.. భవిష్యత్తులో వారిపై ఒక కన్నేయటానికి వీలుంటుంది. మరి.. ఇలాంటి జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటున్నారో లేదో..?