హైదరాబాద్ అలవాటైనవారు వేరే నగరంలో బతకలేరంటారు. వాతావరణం - ఫుడ్ - కల్చర్ - లైఫ్ స్టైల్.. ఇలా అన్ని విషయాల్లో హైదరాబాద్ ద బెస్ట్ సిటీ అంటుంటారు. తాజాగా ఇంటర్నేషనల్ సంస్థల అధ్యయనాల్లోనూ అదే తేలింది. ఇండియాలోని అన్ని నగరాల్లోనూ జీవన ప్రమాణ సూచిలో హైదరాబాద్ కు టాప్ ప్లేస్ దక్కింది. కాగా గత రెండేళ్లలోనూ హైదరాబాదే టాప్ లో ఉండడం విశేషం. కానీ, ఇంటర్నేషనల్ గా హైదరాబాద్ ర్యాంకింగ్ ఈసారి 4 స్థానాలు పడిపోయింది. ప్రఖ్యాత కన్సల్టెన్సీ మెర్సర్ ఈ అధ్యయనం చేసింది.
ఈ సర్వే ప్రధానంగా నగర మౌలిక సదుపాయాలను మదింపు చేసి ర్యాంకు ఇచ్చింది. ఉదాహరణకు ప్రతి నగరంలో విద్యుత్ సరఫరా - మంచినీరు - టెలిఫోన్ - మెయిల్ సర్వీసు - ప్రజారవాణా వ్యవస్థ - ట్రాఫిక్ రద్దీ - స్థానిక విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ విమానాల లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
జీవన ప్రమాణాల సూచిలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆస్ర్టియా రాజధాని వియన్నా నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. జీవన ప్రామాణిక సూచిలో దేశ రాజధాని ఢిల్లి వరుసగా రెండో సంవత్సరం అత్యంత తక్కువ స్కోర్ ను సాధించింది. మెర్సర్ నాణ్యత జీవన ప్రమా ణాల ర్యాంకింగ్ -2017లో హైదరాబాద్ - పుణ మాత్రమే అత్యధిక ర్యాంకులు సాధించాయి. సంప్రదాయబద్దంగా వ్యాపార కేంద్రాలైన ముంబై - ఢిల్లిలో మాత్రం వరుసగా 154 - 161 ర్యాంకులు దక్కించుకున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే గతేడాదితో పోల్చుకుంటే ఐదు స్థానాలు కిందికి దిగి ఈ ఏడాది 144 స్థానానికి చేరింది. గతేడాది 139వ స్థానంలో ఉంది. దీనికి కారణం విద్యుత్ సరఫరా - నీటి సరఫరాల్లో అంతరాయం కలగడమేనని తేల్చిచెప్పింది. ఢిల్లి విషయానికి వస్తే విమానాశ్రయం వల్ల మంచి స్కోరును సాధించింది. దీంతో పాటు అంతర్జాతీయ స్కూల్స్.. ప్రకృతి విపత్తులకు ఆస్కారం తక్కువగా ఉండడం వంటివి కూడా కారణమయ్యాయి. అదేసమయంలో నేరాలు - కాలుష్యం - నీటి కొరత వంటివాటివల్ల మిగతా సిటీల కంటే వెనుకబడిపోయింది.
* హైదరాబాద్ - పూనే - చెన్నైల పట్ల ప్రజలు మొగ్గుచూపడానికి ప్రధాన కారణం అతి తక్కువ క్రైంరేటు - వాతావరణ కాలుష్యం తక్కువ - అంతర్జాతీయ స్కూళ్లు - ఇంగ్లీషు స్కూళ్లు ఎక్కువగా ఉండటం
* చెన్నై విషయానికి వస్తే ఇక్కడ ప్రజారవాణా వ్యవస్థ బాగా మెరుగుపడింది. ముఖ్యంగా బస్సులు, ఇటీవల రెండులైన్ల మెట్రో రైల్, గృహాలు కూడా అందుబాటులోకి రావడం బాగా కలిసొచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/