పాతబస్తీ ఓటింగ్.. అంతా వాళ్ల చేతిలోనే..

Update: 2018-10-13 15:30 GMT
తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నగారా మోగిన తరువాత పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  అవకాశం ఉన్న అన్ని దారులను వెతుకుతున్నారు. హైదరాబాద్ లోని నియోజవకర్గాల్లో కొంచెం విభిన్నం పాతసబస్తీ. ఇక్కడ గెలుపు కోసం మత పెద్దల అండదండలు ఉంటే ఖాయమవడంతో, ఇప్పుడు వాళ్ల చుట్టూ పార్టీ నేతలు తిరుగుతున్నారు.

 పాతబస్తీలో ముస్లిం ఓటింగ్ ప్రాబల్యం ఎక్కువ. ఎప్పటి నుంచో ఎంఐఎంకు పెట్టనికోట ఇది. ఇక్కడ గెలిచే అభ్యర్థుల్లో చాలా మంది ఆ పార్టీ నేతలే ఉంటారు. మరోవైపు నిలదొక్కుకునేందుకు ఎంబీటీ లాంటి పార్టీలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో అందరి చూపు మత పెద్దల పైన పడింది. వాళ్లు చెప్పిన ప్రకామే ఓటింగ్ ఉంటుంది. దీంతో ప్రచారానికంటే ముందు వాళ్ల ఆశీస్సులు పొందేందుకు పోటీలు పడుతున్నారు.

 ఓ మతపెద్ద మాట్లాడుతూ తమ దగ్గరకు అన్ని పార్టీల నేతలు వస్తున్నారని, ఎవ్వరికీ హామీ ఇవ్వడం లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఓం టీం సర్వే జరుపుతుందని, దాని ప్రకారం ఎవ్వరికి మద్దతు ఇవ్వాలనేది నిర్ణయిస్తామని అన్నారు.  తమ అభ్యున్నతి కోసం ప్రయత్నం చేసేవారికే మా ఓటు అని తేల్చి చెప్పారు.  దీం వారు ఎవరికి మద్దతు ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇక్కడ బలంగా ఉన్న ఎంఐఎంపై కూడా కొంతమంది మతపెద్దలు వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈసారి ఎంబీటీ వైపు కొంతమంది మొగ్గుతున్నారట.. అనాధిగా నెట్టుకొస్తున్న ఎంఐఎంపై స్థానికుల్లో వచ్చిన వ్యతిరేకతే  ఈ పరిణామానికి దారితీసిందట.. ఇది ఎంఐఎంను కలవరపెడుతోంది. అందుకే మతపెద్దలను మచ్చిక చేసుకునే పనిలో ఇప్పుడు ఎంఐఎం నేతలు బిజీగా ఉన్నారట..
Tags:    

Similar News