త‌ప్పు చేసినోడికి మీరే చ‌లానా వేసేయొచ్చు!

Update: 2017-09-28 09:44 GMT
పౌర పాత్రికేయం గురించి అంద‌రికి తెలిసిందే. ఇప్పుడు ఇంచుమించు అలాంటి విధానాన్నే తెర మీద‌కు తీసుకొచ్చారు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రూల్స్‌ను బ్రేక్‌చేస్తూ ఇష్టారాజ్యంగా వాహ‌నాల్ని డ్రైవ్ చేసే వారికి షాకిచ్చేలా స‌రికొత్త నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

హెల్మెట్ ప్ర‌యాణించే వారు.. నో పార్కింగ్ లో వాహ‌నాల్ని నిలిపే వారికి సంబంధించిన ఫోటోల్ని తీసి.. త‌మ‌కు పంపాలంటూ హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నాయి. ఇలా త‌ప్పులు చేసే వారికి సంబంధించిన  ఫోటోల్ని సాక్ష్యాలుగా పంపిస్తే.. వాటిని ప‌రిశీలించి చ‌లానాలు విధిస్తామ‌ని వెల్ల‌డించారు.

ఈ నేప‌థ్యంలో ట్రాఫిక్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించినా ఎవ‌రూ చూడ‌లేద‌న్న భావ‌న‌లో ఉండే అడ్డంగా బుక్ కావ‌టం ఖాయం. ఇక‌పై.. న‌గ‌రంలో నెటిజ‌న్ల క‌ళ్లు అనుక్ష‌ణం ట్రాఫిక్ ఉల్లంఘ‌నుల్ని వెంటాడుతుంటాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. నెటిజ‌న్ల నుంచి ట్విట్ట‌ర్ లో అందిన ఫిర్యాదుల్ని హైద‌రాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు స్వీక‌రించి వారికి చ‌లానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఎవ‌రైనా బ్రేక్ చేస్తూ క‌నిపిస్తే వెంట‌నే వారి ఫోటోలు తీయాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. ఆ ఫోటోల్ని హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల అఫీషియ‌ల్ వెబ్ సైట్ ట్విట్ట‌ర్ ఖాతా అయిన (@HYDTP)కు ట్యాగ్ చేస్తే మిగిలిన పనిని పోలీసులు చూసుకుంటారని చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో నెటిజ‌న్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విధించిన చ‌లానా వివ‌రాల్ని హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఒక పోలీసు అధికారి హెల్మెట్ లేకుండా వాహ‌నాన్ని డ్రైవ్ చేస్తున్న ఫోటోను ఒక నెటిజ‌న్ పోస్ట్ చేయ‌గా.. స‌ద‌రు ద్విచ‌క్ర వాహ‌నానికి చ‌లానా విధించారు. సో.. ట్రాఫిక్ రూల్స్ ను ఎట్టి ప‌రిస్థితుల్లో బ్రేక్ చేయ‌మాకండి. వేలాది క‌ళ్లు మిమ్మ‌ల్ని  ఫాలో అవుతున్నాయ‌ని మ‌ర్చిపోవ‌ద్దు.
Tags:    

Similar News