ఇంట్లో ఉండకుండా తిరుగుతుంటే..పట్టేసేలా హైదరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్

Update: 2020-03-29 16:30 GMT
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని ఊరికే అనరుగా. కరోనా వేళ.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించినా.. అదే పనిగా వీధుల్లోకి వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుున్న సంగతి తెలిసిందే. ఎన్ని పరిమితులు విధించినా.. వీధుల్లోకి వచ్చే వారి ‘లెక్క’ తేల్చేలా కొత్త ఐడియాను అమల్లోకి తీసుకొచ్చారు హైదరాబాద్ పోలీసులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం.. ఎవరైనా సరే.. తాము ఉన్న ప్రాంతంలో మూడు కి.మీ. మేర మాత్రమే తిరిగే వీలుంది.

అందుకు భిన్నంగా.. చిన్న చిన్న వీధుల గుండా బయటకు వెళుతున్న వైనం హైదరాబాద్ మహానగరంలో ఎక్కువ అవుతోంది. దీంతో.. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా కొత్త ప్లానింగ్ చేపట్టారు పోలీసులు. ఏదైనా కారు ఒక  ప్రాంతం నుంచి మూడు కి.మీ. దాటి.. ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు గుర్తించేందుకు సీసీ కెమేరాల్ని సాయంగా తీసుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ లో చిన్న మార్పులు చేయటం ద్వారా.. నగర వ్యాప్తంగా ఏదైనా కారు.. ఒక ప్రాంతం నుంచి మూడు కి.మీ. దాటి అదే పనిగా రోడ్డు మీద తిరుగుతుంటే.. ప్రతి మూడు కి.మీ. దాటిన తర్వాత సీసీ కెమేరాలు గుర్తిస్తాయి. ఆ సమాచాన్ని కమాండ్ కంట్రోల్ స్టేషన్ కు అందజేస్తాయి. ఇలాంటి కార్ల విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో నగర కూడళ్లలో వాహనాలు బాగా తగ్గిపోవటం.. ఏదైనా ప్రైవేటు వాహనం మూడు కి.మీ. పరిధిలోనే తిరగాలన్న పరిమితిని ఉల్లంఘిస్తే వెంటనే.. ఈ చలానాలు వేస్తున్నారు. అయినప్పటికీ తీరు మారకపోతే.. సోమవారం నుంచి అలాంటి వాహనాల్ని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ కొత్త ఐడియాతో వీధుల్లోకి వచ్చే వాహనాల సంఖ్య మారే వీలుందని భావిస్తున్నారు.
Tags:    

Similar News