ట్రంప్ నిర్ణ‌యం ఆమె గుండెల్ని పిండేసింద‌ట‌

Update: 2017-01-28 09:57 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ఇన్నాళ్లు అమెరికన్లు మాత్ర‌మే త‌మ అభిప్రాయాలు - నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తుండ‌గా ఇపుడు ఆ జాబితాలో ప్ర‌ముఖులు సైతం చేరిపోతున్నారు. నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత యూసుఫ్‌ జాయి మ‌లాలా తాజాగా ట్రంప్ నిర్ణయంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది. వ‌ల‌స‌ల‌ను అడ్డుకోవ‌డంలో భాగంగా కొన్ని దేశాల వారిని అమెరికాలో అడుగుపెట్ట‌నిచ్చేది లేదని, ముఖ్యంగా ముస్లిం శ‌ర‌ణార్థుల‌ను అడ్డుకుంటాన‌ని ట్రంప్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై మ‌లాల స్పందిస్తూ...ట్రంప్ నిర్ణ‌యం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని  పేర్కొంది. అమెరికా దేశ అధిప‌తి హోదాలో ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌నతో త‌న‌ గుండెపేలిన‌ట్లు మ‌లాలా అభిప్రాయ‌ప‌డింది.

ముస్లిం దేశాల నుంచి వ‌ల‌స వ‌స్తున్న శ‌ర‌ణార్థుల‌పై ఆంక్ష‌లు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ పై ట్రంప్ సంత‌కం చేసిన నేపథ్యంలో మ‌లాల ఒక‌ ప్రకటన విడుదల చేసింది. విశ్వ‌వ్యాప్తంగా అనిశ్చితి నెల‌కొని ఉంద‌ని, ఇటువంటి స‌మ‌యంలో ర‌క్ష‌ణ‌లేని పిల్ల‌లు - కుటుంబాల‌ను ఆద‌రించాల‌ని ఆమె త‌న ప్ర‌క‌ట‌న‌లో డొనాల్డ్ ట్రంప్ ను వేడుకుంది. ఎటువంటి ఆశ్ర‌యం లేనివాళ్ల‌ను నిషేధించ‌రాద‌ని ఆమె ట్రంప్‌ ను కోరింది. త‌ద్వారా త‌న ఉదార‌త‌ను చాటుకోవాల‌ని మ‌లాల పేర్కొంది. ముస్లిం బాలిక‌ల‌కు విద్య నేర్పుతున్న మాలాలాపై 2012లో తాలిబ‌న్లు దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆమె సామాజిక స్పృహ‌ను గుర్తిస్తూ నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. 2014లో కైలాశ్ స‌త్యార్థితో పాటు మాలాలా కూడా నోబెల్ శాంతి బ‌హుమ‌తిని అందుకుంది. నోబెల్ శాంతి బ‌హుమ‌తి అందుకున్న అతిపిన్న వ‌య‌సురాలిగా మాలాలా రికార్డు క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం మాలాలా ఇంగ్లాండ్‌ లో ఉంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News