ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. పాట్నాలో జరిగిన ఎన్డీయే సభ (సంకల్ప్ ర్యాలీ)లో మోడీ ప్రసంగిస్తూ.. యురిలో ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత సైనికదళం నిర్వహించిన లక్షిత దాడులను, పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా నిర్వహించిన వైమానిక దాడులను విపక్షాలు శంకిస్తున్నాయని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించి దేశాన్ని భద్రంగా ఉంచేందుకు, అవినీతిని, పేదరికాన్ని నిర్మూలించి ఉద్యోగాలను సృష్టించేందుకు తాను కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
విపక్షాల తీరు పాక్ కు మేలు చేసేలా ఉన్నాయని మోడీ ఆరోపించారు. `ఈ పార్టీలు పాకిస్థాన్ కు నచ్చేలా మాట్లాడటం సముచితమేనా? ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నుంచి తమను తాము కాపాడుకునేందుకు పాక్ నేతలు మన విపక్షాల వ్యాఖ్యలను రక్షణ కవచంగా ఉపయోగించుకుంటూ ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు` అంటూ మోడీ నిప్పులు చెరిగారు. `దేశమంతా ఒకే మాట మాట్లాడాల్సిన తరుణంలో మన చర్యలను ఖండిస్తూ తీర్మానం చేసేందుకు 21 ప్రతిపక్షాలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. మన సాయుధ బలగాల వీరోచిత చర్యకు రుజువులు చూపాలని ఆ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పేదల పేరుతో రాజకీయ దుకాణాలను నడుపుతున్న కొందరు నాయకులు తమ రాజవంశాల గురించి తప్ప దేనినీ పట్టించుకోవడంలేదు. ఈ చౌకీదార్ (కాపలాదారు) వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు. కానీ విధి నిర్వహణలో ఈ చౌకీదార్ ఎల్లప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు` అని మోడీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై ప్రధాని కూడా నిప్పులు చెరిగారు. `దాణా కొనుగోలు పేరుతో బీహార్ లో ఏమి జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ప్రజాధనాన్ని దారిమళ్లించే మధ్యవర్తులకు అడ్డుకట్ట వేసేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది. చీకటి రోజుల నుంచి బీహార్ ను బయటికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా` అని మోడీ పేర్కొన్నారు. బీహార్ లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఎన్డీయే ప్రభుత్వ కృషి చేస్తున్నదని తెలిపారు. తనను విమర్శించేందుకు విపక్షాలు పోటీపడుతున్నాయని, ఆ పార్టీలను మరోసారి శిక్షించి మరిన్ని గుణపాఠాలు చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అత్యుత్తమ సౌకర్యాలను అందించాలని తమ ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నదని ప్రకటించారు.