తోడబుట్టిన చెల్లెలినే పట్టించుకోని చంద్రన్న రాష్ట్రంలోని చెల్లెమ్మలను చూసుకుంటాడా?
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుండగా.. ఇతర నేతలూ విమర్శనాస్త్రాలను పదును పెడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు తీరును ఎండగట్టడానికి ఒకప్పుడు టీడీపీలో ఉన్నవారు, చంద్రబాబు బంధువర్గం కూడా సిద్ధమవుతున్నారు. చంద్రబాబు బండారాన్ని బయటపెడుతూ విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్ గెలవబోతున్నారని చెప్పిన ఆయన 2014లో చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి అట్టర్ ప్లాప్ అయ్యారన్నారు. రాష్ట్రంలోని మహిళలను అక్కాచెల్లెలుగా సంబోధిస్తూ వారి సంక్షేమం చూసుకుంటానని చెబుతున్న చంద్రబాబు తన సొంత చెల్లెలినే పట్టించుకోలేదన్న సంగతి ప్రజలకు తెలియదన్నారు.
చంద్రబాబు సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని.. తమ్ముడిని గొలుసులతో కట్టేసి పిచ్చి పట్టేలా చేశారని నార్నె ఆరోపించారు. ‘‘చంద్రగిరిలో ఓటింగ్ పెడితే చంద్రబాబు మీద రామ్మూర్తినాయుడే గెలుస్తాడు. అందుకే చంద్రబాబు తన మకాన్ని కుప్పానికి మార్చుకున్నాడు. అలాగే తిరుపతిలో చంద్రబాబు సొంత సోదరికి ప్రమాదం జరిగినా, ఇంతవరకూ ఆమెను ఎవరూ పరామర్శించలేదు. తోడబుట్టిన చెల్లిని చూడని చంద్రబాబు ఏపీ చెల్లెమ్మలను ఎలా చూసుకుంటాడు?’’ అని నార్నె ప్రశ్నించారు.
చంద్రబాబు ఏ రోజూ ఎన్నికల్లో సొంత బలంతో గెలవలేదని.. ఆయన కొడుకు లోకేశ్ పదో తరగతి పాస్ కావడానికి ఏం చేశాడో తనకు తెలుసని నార్నె చెప్పారు. లోకేశ్ పాసయ్యేందుకు మంత్రి నారాయణ ఎలా సహకరించాడో కూడా తెలుసన్నారు. అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు ఎంత ముట్టచెబుతున్నాడో కూడా తెలుసని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా చంద్రబాబే స్వయంగా అడ్డుకున్నారని నార్నె ఆరోపించారు.