సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారన్న సంగతి తెలిసిందే. దీనికోసం ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికైనా ఆయన వెనుకాడరు. తాజాగా ఆయన మరింత శ్రుతిమించిన వ్యాఖ్యలు చేసి మరోమారు వివాదం సృష్టించారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ గానే పేరొందిన సాధ్వీ ప్రాచీని తాను ప్రేమిస్తున్నానని ఆజంఖాన్ చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. విలేకరులతో ఆయన మాట్లాడుతూ... తాను సాధ్వీ ప్రాచీని ప్రేమిస్తున్నానని, అయితే ఆరెస్సెస్ దీనిని 'లవ్ జిహాదీ'గా పేర్కొంటుందేమోనని భయంగా ఉందని చెప్పారు. 'నేను సాధ్వీని ప్రేమిస్తున్నాను. అయినా ఆమె అంతగా బాంబులు ఎందుకు పేలుస్తుంటుందో (తీవ్రమైన, వివాదాస్పదమైన ప్రకటనలు ఎందుకు చేస్తుందో)'నని ఆజంఖాన్ అన్నారు.
ఆరెస్సెస్ ను, ప్రాచీని టార్గెట్ చేసుకునే ఆజంఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదమైన, తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంలో ముందుండే ఆయన బీజేపీ నేతలను, ముఖ్యంగా సాధువులను తీవ్రంగా విమర్శిస్తుంటారు. లవ్ జిహాద్ ను నేపథ్యంగా తన వ్యాఖ్యలను రక్తికట్టించడం కోసం ఆయన ఇంతగా తెగించి మాట్లాడారని అంటున్నారు. ఏదైనా కూడా వ్యక్తులను విమర్శించడం కోసం ఇలా అనవసర వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదన్న వినిపిస్తోంది. ఆజంఖాన్ గతంలోనూ ఇలా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును కూల్చేసినట్లుగా తాజ్ మహల్ ను శివసేన కూల్చాలన్నారు.