ఎప్పుడో సూపర్ స్టార్ రజినీకాంత్ పై పెట్టిన ఆదాయపు పన్ను కేసును తాజాగా ఆ శాఖ కోర్టులో ఉపసంహరించుకుంది. అతడు కొన్ని లక్షలకు పన్ను విషయంలో ఆధారాలు సమర్పించలేదని ఆదాయపు పన్ను శాఖ వేసిన కేసును తాజాగా కోర్టు కొట్టివేసింది..
2002-03 నుంచి 2004-05 వరకు అసెస్ మెంట్ సంవత్సరాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ 66 లక్షల ఆదాయానికి సంబంధించి చూపించలేదని ఆ సమయంలో ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేసింది. దీనిపై రజినీకాంత్ హైకోర్టుకు వెళ్లాడు..
ఆ తర్వాత 66 లక్షలకు సంబంధించిన మొత్తంపై పూర్తి వివరాలతో ఐటీశాఖను సంప్రదించి ఫైల్ దాఖలు చేశారు. ఇక కోర్టులోనూ కోటి రూపాయలకంటే తక్కువ మొత్తం కావడంతో దీనికి జరిమానా ఆదాయపు పన్ను శాఖ విధించడానికి వీలుకాదు.. రజినీకాంత్ ఆదాయంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. పైగా ఆయన పన్నుపై వివరాలు దాఖలు చేశారు. దీంతో రజినీ కాంత్ చూపించిన ఆధారాలు, కోటి రూపాయలకంటే తక్కువ మొత్తం కావడంతో ఐటీశాఖ పన్ను విధించలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసును ఐటీశాఖ ఉపసంహరించుకుంది. హైకోర్టు కూడా ఈ కేసును కొట్టివేసింది.