160 కోట్ల నగదు.. 100 కిలోల బంగారం.. ఇంత సొమ్ము ఇంట్లోనే పెట్టుకున్నాడంటే ఇక బయట బ్యాంకులు - ఇతర ఆస్తిపాస్తులు ఎన్ని ఉంటాయి.. దేశచరిత్రలోనే అదిపెద్ద ఐటీదాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో సొమ్ము - నగదు పట్టుబడడం తొలిసారి అంటూ ఐటీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో సోమవారం ఉదయం ఐటీశాఖ తనిఖీలు చేసింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 30 చోట్ల దాడులు నిర్వహించింది. ఇందులో కళ్లు చెదిరే అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇవి చూసి మీడియా - అధికారులు నోరెళ్లబెట్టారు.
తమిళనాడులోని చైన్నైతోపాటు అరుప్పుకొట్టేలో ఉన్న ఓ బడా కాంట్రాక్టర్ - అతడి అనుబంధ సంస్థలపై సోమవారం ఐటీశాఖ దాడి చేసి సోదాలు నిర్వహించింది. ఇందులో ఏకంగా 160 కోట్ల నగదు.. 100 కిలోల బంగారం పట్టుబడింది. సదురు గుత్తేదారు ఎస్పీకే కంపెనీ దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణ పనులు చేపడుతోంది. కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వాలు టెండర్లు పొంది రోడ్లను నిర్మిస్తుంది. అయితే ఈ సంస్థల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందడంతో ఐటీశాఖ రంగంలోకి దిగి దాడులు చేసింది. సోమవారం ఇంత డబ్బు పట్టుబడగా.. మరి మంగళవారం ఇంకా ఎన్ని కోట్లు బయటపడుతాయో చూడాలి మరి.