లైంగిక దాడి జరిగితే ఏడుస్తూ కూర్చోవటం గతం మాట. మారిన కాలంతోపాటు.. జరిగిన దారుణంపై ఓపెన్ గా మాట్లాడటమేకాదు.. తప్పు చేసిన వారి తాట తీసేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిలో ప్రముఖులు కూడా చేరుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెబితే ఏదో జరిగిపోతుందన్న భయాందోళనలకు గురి కాకుండా.. రేప్ లాంటి దారుణాల జరిగినప్పుడు బయటకు చెప్పే మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు కొందరు ప్రముఖులు. ఇప్పుడు అదే జాబితాలోకి చేరుతారు ప్రముఖ హాలీవుడ్ నటి.. సామాజిక కార్యకర్త అయిన ఆష్లే జడ్.
తన జీవితంలో జరిగిన దారుణాల గురించి ఆమె ప్రపంచానికి చెప్పారు. ఏడేళ్ల వయసులో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని.. 14 ఏళ్ల వయసులో రేప్ కు గురైన విషయాన్ని ఆమె చెప్పారు. తనపై 1998లో రేప్ జరిగినప్పటికీ తాను అక్రమ రవాణా బారిన పడలేకపోవటం ఆశ్చర్యరంగా అభివర్ణించారు. ఒక సదస్సులో పాల్గొనటానికి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఆమె.. తనకు ఎదురైన దారుణ అనుభవాల్ని చెప్పేందుకు ఆమె ఏమాత్రం మొహమాట పడలేదు.
మీడియాలో మాట్లాడే సమయంలో ఇంగ్లిషులో మాట్లాడిన ఆమె.. ప్రెస్ మీట్ ముగిసే కొద్దిసేపు ముందు మాత్రం హిందీలో మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను విపరీతంగా వ్యతిరేకంచే ప్రముఖ సెలబ్రిటీలలో ఒకరైన ఆష్లే.. హాలీవుడ్ లోనూ లింగ వివక్ష ఉందని.. పురుషులతో పోలిస్తే.. నటీమణులకు ఇచ్చే పారితోషికంలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/