అభిమానం కొన్నిసార్లు చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. అంత మాత్రానికే సహనం కోల్పోయి నోటికి వచ్చినట్లుగా తిట్టేస్తే ఏం బాగుంటుంది? ఈ చిన్న విషయాన్ని మిస్ అయిన హర్యానా ముఖ్యమంత్రి ఇప్పుడు విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు సంచలనంగా మారాయి. ఎన్నికల ముందు ఈ తరహా వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీయటమే కాదు.. కొత్త తలనొప్పులు తెచ్చి పెడతాయంటున్నారు. ఇంతకీ జరిగిందేమంటే..
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ప్రజలకు మరింత దగ్గరయ్యే పనిలో భాగంగా జన ఆశీర్వాద యాత్రను హర్యానాలోని బీజేపీ సర్కారు చేపట్టింది. యాత్రలో భాగంగా తాజాగా ఓపెన్ మినీ ట్రక్కు పై నిలబడిన ముఖ్యమంత్రి ఖట్టర్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అంతలో పక్కనున్న ఒక కార్యకర్త ఆయనకు ఒక గొడ్డలిని బహుకరించారు.
దాన్ని చూసిన ఆయన సంతోషించారు. తన ప్రసంగంలో ఊపును పెంచారు. అదే సమయంలో అనుకోనిరీతిలో ఒక కార్యకర్త ఆయన నెత్తిన కిరీటం పెట్టే ప్రయత్నం చేశారు. దీనికి.. ఒళ్లు మండిన సీఎం ఖట్టర్ కోపాన్ని నియంత్రించుకోలేక నోరు పారేసుకున్నారు. సదరు కార్యకర్తను ఉద్దేశించి మెడ కోసేస్తా నీది అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయపడిన సదరు కార్యకర్త ముఖ్యమంత్రుల వారిని క్షమాపణలు కోరుకోవటంతో ఆయన శాంతించారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్నికలు దగ్గరకు వచ్చిన వేళ.. ఈ వివాదం ఏమిటి? అంటూ కమలనాథులు తల పట్టుకుంటున్నారు.