రాజ‌మ‌హేంద్ర‌వరం లో యుద్ధవిమానాలు!

Update: 2017-08-02 06:48 GMT
రాజ‌మ‌హేంద్ర‌పురం రూపురేఖ‌లు మారిపోనున్నాయా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది. ప్ర‌తికూల ప‌రిస్థితులు లేదంటే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఉన్న ప‌ళంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా కొన్ని ప్రాంతాల్ని ఎంపిక చేస్తున్నారు. తాజా ఎంపిక‌లో ఏపీలోని రాజ‌మహేంద్ర‌వ‌రానికి ఈ అవ‌కాశం ల‌భించింది. నేష‌న‌ల్ హైవేల మీద యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా దేశంలోని ప‌లురాష్ట్రాల్లో ఎయిర్ స్ట్రిప్ ల‌ను పెంచాల‌ని నిర్ణయించారు.

దీనిపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు సాగాయి. కేంద్ర జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ‌తో ఏడాదిగా సాగుతున్న చ‌ర్చ‌లు ఒక కొలిక్కి రావ‌టంతో పాటు.. దేశంలోని 12 నేష‌న‌ల్ హైవేల మీద ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ ను ఏర్పాటు చేసే అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి.

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ప్ర‌తిపాద‌న‌తో కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. ప‌న్నెండులో ఏపీలోని రాజ‌మ‌హేంద్ర‌వరాన్ని కూడా చేర్చిన‌ట్లు చెబుతున్నారు. మావోల‌తో పాటు ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించే అవ‌కాశం ఉన్న రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయ‌నున్నారు. మ‌న్యం ఉండ‌టం.. స‌ముద్ర తీర ప్రాంతం కూడా ఉన్న నేప‌థ్యంలో రాజ‌మ‌హేంద్ర‌వరం జాబితాలో చేర్చిన‌ట్లుగా తెలుస్తోంది.

రాజ‌మ‌హేంద్ర‌వరం మీదుగా వెళ్లే జాతీయ ర‌హ‌దారి 16ను ఎంపిక చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఎయిర్ స్ట్రిప్ కోసం ఆరు వ‌రుస‌ల రోడ్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పుడున్న ర‌హ‌దారులు ఎయిర్ స్ట్రిప్ ల‌ను అనువుగా ఉండ‌వ‌ని.. అందుకే.. బైపాస్ రోడ్ల‌ను ఏర్పాటు చేస్తార‌ని చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన లోతైన చ‌ర్చ‌లు మ‌రిన్ని జ‌ర‌గాల్సి ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక‌.. ర‌హ‌దారుల‌పై ఏర్పాటు చేసే ఎయిర్ స్ట్రిప్ ల‌కు అవ‌స‌ర‌మైన నిధుల‌ను భార‌త వాయుసేన అందించ‌నుంది. ఏమైనా రానున్న రోజుల్లో రాజ‌మ‌హేంద్ర‌వరం రూపురేఖ‌లు మారే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.
Tags:    

Similar News