ఏపీలో ఐఏఎస్ ల మధ్య లొల్లి.. కన్నేయండి జగన్

Update: 2019-11-03 06:24 GMT
ఏపీలో ఐఏఎస్ ల మధ్య నడుస్తున్న చర్చ ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. తమను అవమానానికి గురి చేస్తున్నట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తన అక్రోశాన్ని లేఖ రూపంలో సీఎస్ కు రాయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రిన్సిపుల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పై అడిషనల్ సెక్రటరీ గురుమూర్తి తాజాగా ఫిర్యాదు చేశారు. తమకు ఏ రోజు సరైన సమాచారం ఇవ్వరని.. ఏదైనా పొరపాటు జరిగినా.. ఫెయిల్యూర్ అయినా తమదే అంతా తప్పని తమ మీద తోసేస్తుంటారన్నారు. తమను అదే పనిగా అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సహచర ఉద్యోగుల ముందు తమను ఎల్లప్పుడూ కించపరిచేలా మాట్లాడుతున్నట్లు చెప్పిన వైనం సంచలనంగా మారింది. తాను 24 ఏళ్లుగా  సర్వీసులో ఉన్నానని.. 1993లో సివిల్స్ లో తాను ఉతీర్ణత సాధించినట్లు చెప్పారు. ఆయన దగ్గర పని చేయటం చాలా కష్టంగా ఉంది.. దయచేసి నన్ను వేరే శాఖకు బదిలీ చేయాలంటూ గురుమూర్తి రాసిన లేఖ బయటకు వచ్చి సంచలనంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఐఏఎస్ ల మధ్య నెలకొన్న విభేదాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఒక కన్నేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News