ఐఏఎస్, ఐపీఎస్, ఐఆరెస్...ఏపీ పాలిటిక్స్ కంప్లీట్ చేంజ్

Update: 2022-10-24 13:30 GMT
రాజకీయాల్లో మేధావులు రావాలన్నది ఎపుడూ నినాదంగా ఉంటోంది. నిజానికి చాలా మంది మేధావులు వస్తున్నా వారు ఇమడలేకపోతున్నారు. ట్రెడిషనల్ పాలిటిక్స్ లో వారికి స్థానం ఉండడం లేదు. రొడ్డకొట్టుడు రాజకీయాల్లో వారి గొంతు సరిగ్గా వినబడకుండా పరిస్థితులు చేస్తున్నాయి. పాలిటిక్స్ అంటే పక్కా మాస్ అని ఒక భావన ఏర్పడిపోయిన వేళ క్లాసికల్ టచ్ లో మెత్తమెత్తగా రాజకీయ పదనిసలు పలికే వారికి సక్సెస్ దక్కదన్న బలీయమైన భావన కూడా ఎక్కడో ఉండిపోయింది.

ఇదిలా ఉంటే అది తప్పుడు అభిప్రాయం అని చెప్పి మాస్ రాజకీయాల్లో క్లాస్ టచ్ ఎలా ఉంటుందో చూపించి అజేయుడిగా నిలిచిన వారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఆయన 2012లో పార్టీ పెట్టి ఈ రోజు దేశంలో ఒక్కో రాష్ట్రలో తన ఉనినికి బలంగా చాటుకుంటున్నారు. రేపటి రోజున బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఆయన తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఆయన సక్సెస్ అయిన తరువాత చాలా మంది హై లెవెల్ అధికారులలో రాజకీయ ఆశలు ఆకాంక్షలు బాగా ఎక్కువ అయ్యాయనే చెప్పాలి.

ఆయన కంటే ముందు 2009 ఎన్నికల్లో లోక్ సత్తా అధినేత మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ పోటీ చేసి కూకట్ పల్లి నుంచి గెలిచారు. ఎమ్మెల్యేగా శాసనసభలో తన బలమైన వాణిని వినిపించారు. ఆయన 2014 ఎన్నికల్లో మాత్రం ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయారు. 2019 నాటికి సైలెంట్ అయిన జేపీ 2024లో పోటీకి రెడీ అంటున్నారు. ఆయన ఈసారి ఏపీ నుంచి పోటీకి సిద్ధపడుతున్నారని అంటున్నారు.ఆయన విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి తన సత్తా చాటుతారని అంటున్నారు.

ఇక ఐపీఎస్ అధికారిగా తానేంటో రుజువు చేసుకుని ఒక సినీ సెలిబ్రిటీతో సరిసమానమైన ఇమేజ్ ని సోంతం చేసుకున్న జేడీ లక్ష్మీ నారాయణ 2019 ఎన్నికలో విశాఖ నుంచి జనసేన తరఫున పోటీ చేసి రెండు లక్షల ఎనభై వేలకు పైగా ఓట్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరచారు. ఆయన గత మూడేళ్ళుగా ప్రజా సమస్యల మీద గట్టిగా పోరాడుతున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి మరోమారు ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు.

ఇక మాజీ ఐపీఎస్ అధికారి సాంబశివరావు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు అని అంటున్నారు. ఆయన కూడా సరైన పార్టీని చూసుకుని పోటీకి సిద్ధపడతారు అని తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ  ఐపీఎస్, ఐఏఏస్ అధికారులు రంగంలో ఉంటారని తెలుస్తోంది. ఇక వీటన్నిటి కంటే అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆప్ ఏపీలో కాలు పెట్టడం. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తన రాజకీయ వాటా ఏంటో తేల్చుకోవడానికి ఆప్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది అంటున్నారు.

మాజీ ఐఆరెస్ అధికారి  అయిన కేజ్రీవాల్ ఏపీ రాజకీయల్లో కనుక సనడి చేస్తే టోటల్ పిక్చర్   మారుతుందా అన్న చర్చ అయితే ఉంది. ఏపీలో ఇపుడున్న పరిస్థితులు చూస్తే కనుక అందరికీ ఆందోళన కలుగుతోంది. రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తు పక్కకు పోతోందని,  అలా పెడుతున్నారని బెంగ అయితే సర్వత్రా ఉంది. అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. అలాగే రాజధాని ఇష్యూ రావణ కాష్టంగా ఉంది. పోలవరం అతీ గతీ లేదు, అభివృద్ధి లేదు, పరిశ్రామలు అన్నది లేదు. ఇలా ఏపీ కనుక ఉంటే మెయిన్ స్ట్రీం లోకి రావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో అన్నది ఎవరికీ అంతు పట్టడంలేదు.'

దాంతో ఈసారి ఏపీ మీద బ్యూరోక్రాట్స్ అంతా ఫోకస్ పెట్టారని అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా తమకు ఉన్న విజన్ తో విభజన ఏపీని కష్టాల నుంచి బయటకు తెచ్చేందుకు తన వంతుగా సాయం చేయడానికి ప్రత్యక్ష రాజకీయాలోకి దూకుతున్నారని అంటున్నారు. మరి ఏపీ జనాలకు కూడా రెండు వర్గాలు రెండు పార్టీలు, రెండు శక్తులు అటూ ఇటూ పోరు అని మోహరించి ఉన్న భీకర రాజకీయ పోరు మీద కొంత విసుగు చికాకూ ఉన్నాయి. దాంతో ఏపీకి మంచి చేయాలనుకునే బ్యూరోక్రాట్స్  కనుక పోటీకి దిగితే వారిని ఆదరిస్తారా అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి గేమ్ చేంజర్స్ ని మేమే అంటూ  బ్యూరోక్రాట్స్ ఫీల్డ్ లోకి దిగిపోతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News