తెలంగాణ ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక విభాగాలు చూస్తున్న సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ మరో వివాదంలో చిక్కుకున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇటీవల ఆగస్టు 15 సందర్భంగా గుజరాత్‌లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన 11 మందికి గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిన సంగతి తెలిసిందే.
దీంతో జీవిత ఖైదు అనుభవిస్తున్న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో వారికి జైలు వద్ద కొంతమంది పూల దండలతో స్వాగత సత్కారాలు పలకడం, మిఠాయిలు తినిపించడంపై గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు కూడా నిందితుల విడుదలను ఖండించాయి.
'వాళ్లకు ఉరితాళ్లే సరి.. పూలదండలతో సన్మానాలు కాదు. వారి క్షమాభిక్షను రద్దు చేసి మా నమ్మకాన్ని పునరుద్ధరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో పాటు రాజ్యాంగ అధిపతులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని స్మితా సబర్వాల్ ఆగస్టు 21న ఆదివారం మరో ట్వీట్ చేశారు.
'ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా ఈ వార్తలు చదువుతున్నప్పుడు నమ్మలేకపోయా. భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్ బానో హక్కులను హరించి, మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేము' అని రెండు రోజుల కింద స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
దీంతో స్మితా సబర్వాల్ ధైర్యానికి ఆమెను పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరమని, సివిల్ సర్వీసు నిబంధనలకు విరుద్ధమని స్మితను తప్పుబడుతున్నారు. కాగా కొంతమంది కొందరు ఐఏఎస్ అధికారులు స్మితను సమర్థిస్తున్నారు. మరికొందరు ఐఏఎస్ లు మాత్రం స్మిత సబర్వాల్ గీత దాటారని విమర్శిస్తున్నారు.
నెటిజన్ల విమర్శలకు స్మితా సబర్వాల్ ఏమాత్రం చలించడం లేదు. పైగా 'ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ అధికారుల వాక్ స్వాతంత్య్రాన్ని హరించే సర్వీసు నిబంధనలను రద్దు చేయాల్సిన సమయం వచ్చింది' అంటూ మరో ట్వీట్ చేయడం గమనార్హం. ఇక గుజరాత్ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తున్న వాళ్లు, బీజేపీ సానుభూతిపరులు స్మిత సబర్వాల్ పై ఘాటు కామెంట్లు చేస్తున్నారు.