ఐబీఎం సీఈవోకి ఉద్యోగిని ఇచ్చిన ‘ట్రంప్’ షాక్

Update: 2016-11-30 10:29 GMT
అమెరికా అధ్యక్షుడిగా సంచలన విజయాన్ని సాధించిన డొనాల్డ్‌ ట్రంప్ కారణంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన గెలుపు సంగతేమోకానీ.. అమెరికాలో అంతర్గతంగా చాలానే రచ్చ జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ట్రంప్ ను సమర్థించే వారిని అమెరికాలో అనుమానంగా చూసే ధోరణి కాస్త ఉంది. ఎన్నికల ముందు వరకూ ఇలాంటివి ఓకే అయినా.. ఇప్పుడాయన అమెరికాకు అధ్యక్షుడు కానుండటంతో ఆయనకు దగ్గరయ్యేందుకు.. ఆయన్ను అధ్యక్షుల వారిగా ఒప్పుకుంటున్నట్లుగా కొంత మంది ప్రముఖలు తమదైన శైలిలో వ్యవహరిస్తున్న వైఖరికి కొన్నిచోట్ల షాకులు ఎదురవుతున్నాయి.

తాజాగా అలాంటి షాక్ ఐబీఎం సీఈవో రొమెట్టికి తగిలింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఐబీఎం సీఈవో స్పందిస్తూ.. ట్రంప్ కు తాము మద్దుతు పలుకుతున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఆయన విధానాలతో తాము ఏకీభవిస్తున్నట్లుగా వెల్లడించిన రొమెట్టి.. ఆయన ఎన్నిక కావటాన్ని అభినందిస్తూ ఒక లేఖను రాశారు. ముస్లిం.. వలసవాదులు.. లాటిన్ అమెరికన్ల పట్ల ట్రంప్ అనుసరించే విధానాల‌నే తాము అనుసరిస్తామని ఆమె పేర్కొన్నారు.

కంపెనీ సీఈవో రాసిన లేఖపై ఆ కంపెనీకి చెందిన సీనియర్ ఉద్యోగిని ఎలిజబెత్ ఉడ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇంతకాలం కంపెనీ వృద్ధికి అండగా నిలిచిన వారిని వలసవాదులుగా పేర్కొంటూ నల్లజాతీయులు.. ముస్లింల పట్ల ఇలాంటి వైఖరి అనుసరిస్తానని చెప్పటం ఏమాత్రం సరికాదంటూ ఆమె తనలేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగుల మనోభావాలు గుర్తించకుండా ట్రంప్ కు సీఈవో రాసిన లేఖతో ఐబీఎం ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని..మరికొందరు ఉద్యోగులు.. ఎలిజబెత్ బాటలో పయనించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News