అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే..!

Update: 2022-03-12 08:38 GMT
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.  ఈ సైనిక చర్య నేటికి 17 వ రోజుకు చేరుకుంది. కానీ ఎక్కడా ప్రశాంత వాతావరణం కనిపిస్తున్నట్లు లేదు. మొదటి రోజు ను నుంచి రష్యా ఏ విధంగా అయితే దాడులకు తెగబడిందో.. ఇప్పటికీ అలాగే కొనసాగిస్తోంది. రష్యా బాంబులు, క్షిపణి దాడులకు ఉక్రెయిన్ నగరాలు చిరుగుటాకుల్లా వణుకుతున్నాయి. జనావాసాలను లక్ష్యంగా చేసుకుని రష్యా సేనలు దాడులకు పాల్పడుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. కానీ ఈ వార్తలను రష్యా ఖండిస్తుంది. ఇప్పటికే చాలా నగరాల్లో మానవతా కారిడార్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది రష్యా. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లో శవాలు దిబ్బులు దర్శనం ఇస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.
 
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్, రష్యా  సైనిక చర్యపై  చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసారు. ఉక్రెయిన్ లోని  కేవలం ఒకటో రెండో నగరాలను పుతిన్ అధీనంలోకి తెచ్చుకోవచ్చు గానీ.. దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అతని తరం కాదని అన్నారు. ఈ యుద్ధంలో అమెరికా బలగాలను ఉక్రెయిన్ కు పంపే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. నాటో సభ్య దేశాలుగా ఉన్న ఏ  దేశంలో అయినా  రష్యా దాడికి దిగితే.. తాము చూస్తూ ఊరుకోమని తెలిపారు. నాటో సభ్య దేశాలకు సంబంధించిన బలగాలను కూడా ఉక్రెయిన్ కు  మద్దతుగా పంపే ఆలోచన తమకు లేదని అన్నారు. ఒకవేళ  అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని తెలిపారు.
 
ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగిన రష్యా  ఇప్పటికే చాలా నష్టపోయిందని  అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. ఇంకా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై  రష్యా గెలవడం అనేది భ్రమ అని అన్నారు. ఇలాంటి ఆలోచనలు పుతిన్ మానుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు తాము  రష్యాతో పరోక్ష యుద్ధం లో ఉన్నామని పేర్కొన్నారు బైడెన్.

ఈ యద్ధం విషయంలో కచ్చితంగా రష్యా చేస్తున్న దారుణాలను అరికట్టే దిశగా తాము, నాటో దేశాలు అడుగులు వేస్తున్నాయని బైడెన్ అన్నారు.  దీనిలో భాగంగా రష్యా పై ఆంక్షను విధించినట్లు తెలిపారు. ఇంకా మరిన్ని అంక్షలను విధించి మరింత కఠినతరం చేస్తామని తెలిపారు.
 
మరోవైపు రష్యా,  ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు దౌత్య చర్చలు జరిగినా కానీ.. అవి ఫలించలేదు. దీంతో రష్యా దాడులను తీవ్రతరం  చేసింది. మరో పైవు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. రష్యా పై ఆంక్షలు విధిస్తున్నాయి. అంతేగాకుండా బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం ప్రకటించింది. దీనికి ఆ దేశ చట్ట సభ్యులు ఆమోదం కూడా తెలిపారు.

మరోవైపు మరి కొన్ని దేశాల అయితే ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేస్తున్నారు. రష్యా ను అడ్డుకునే దానిలో భాగంగానే  ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నాయి నాటో దేశాలు. ఇదిలా ఉంటే  రష్యా నుంచి దిగుమతయ్యే వాటిపై అమెరికా ఆంక్షలు మరింత కఠిన తరం చేసింది. మద్యం, సీఫుడ్, వజ్రాలు వంటి దిగుమతులను ఏకంగా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని వెంటనే ఆమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బైడెన్.
Tags:    

Similar News