ఉన్న సమస్యలు చాలవన్నట్లుగా పోలవరం ప్రాజెక్టును ఇపుడు కోర్టు కేసులు కూడా కమ్ముకున్నాయి. అసలే ప్రాజెక్టుకు నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం నానా ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రాజెక్టు పనులు జరగాల్సినంత వేగంగా జరగటం లేదు. ఇలాంటి సమయంలోనే సుప్రింకోర్టులో చత్తీస్ ఘడ్, తెలంగాణా, ఒడిస్సా నుండి దాఖలైన పిటీషన్లపై విచారణ మొదలైంది. ప్రాజెక్టు పరిధిని పెంచటం వల్ల ముంపు ప్రాంతాలు పెరిగిపోతున్నాయని ఒడిస్సా ప్రభుత్వం కేసు దాఖలు చేసింది.
అలాగే ప్రాజెక్టు వల్ల తలెత్తబోయే సమస్యలపై తెలంగాణా, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు కూడా వేర్వేరుగా కేసులు వేశాయి. పై రాష్ట్రాలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి వెంటనే మూడు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పింది. అవసరమైతే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెలలోనే సమావేశం ఏర్పాటు చేసి వివాదాల పరిష్కారానికి మార్గం చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మామూలుగా ఏ విషయం కూడా కోర్టుకు ఎక్కకూడదు. ఒకసారి కోర్టు మెట్లెక్కితే ఇక ఆ వివాదం ఎప్పటికి పరిష్కారమవుతుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి చేయాలనే తొందర ఏపీ ప్రభుత్వానికి ఉన్నా అడ్డుకోవాలన్న ఆలోచనతో ఉన్న ఒడిస్సా, తెలంగాణా, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు వివాదాలను సాగదీస్తాయి.
దీనివల్ల ఏపీ ప్రభుత్వం ఒకవైపు, మిగిలిన మూడు ప్రభుత్వాలు మరోవైపు ఉంటాయి. దీంతో సమస్య ఎంతకాలమైనా పరిష్కారం కాదు. నిజానికి కోర్టులో కేసులు వేయకుండానే వివాదాలను పరిష్కరించుకునే అవకాశం మూడు రాష్ట్రాలకూ ఉంది. అయినా ఆ విషయాన్ని పక్కన పెట్టేసి కోర్టులో కేసులు దాఖలు చేయటంతోనే వాటి అంతరంగం అర్ధమవుతోంది.
వివాదాలను పరిష్కరించుకునే ఉద్దేశ్యమే ఉంటే అసలు కోర్టులో కేసులే దాఖలు చేయవు. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని యూపీఏ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై కావాలనే రాద్దాంతం చేస్తోంది.
సుప్రీంకోర్టులో విచారణ కారణంగా సాగు, తాగునీటితో పాటు జలవిద్యుత్ ఉత్పత్తికి కూడా ఉద్దేశించిన పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో అనే అయోమయం పెరిగిపోతోంది. సుప్రీంకోర్టు ఎంతతొందరగా వివాదాన్ని పరిష్కరిస్తుందో చూడాలి. కేటీఆర్, కేసీఆర్... జగన్ మాకు మంచి మిత్రుడు అంటారు... మరి ఆ చనువుతో జగన్ దీనిని తెలంగాణ వైపు నుంచి పరిష్కరించలేరా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.