కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. చాలా దేశాల్లో వైరస్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ ఒక్కరోజే సుమారు 23 లక్షలకు పైగా కేసుల వెలుగు చూసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. వైరస్ తో చనిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 వేల మంది పైగా కరోనా కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఒక్క అగ్రరాజ్యం అమెరికాలో సుమారు 8.5 లక్షల కేసులు నమోదు అయినట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరో వైపు ఫ్రాన్స్ లో కూడా వైరస్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. సుమారు 3 లక్షలకు పైగా కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్, స్పెయిన్, ఇటలీలో కూడా కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడం ఆ దేశ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.
పెరుగుతున్న వైరస్ కేసుల ప్రభావం చాలా బహుళ జాతి కంపెనీలపై పడింది. దీంతో అనేక సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతికి మొగ్గు చూపుతున్నారు. దీంతో బహుళ జాతి సంస్థలు ఉద్యోగులు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ చేసే వారికి కావాల్సిన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే చాలా మంది ఉద్యోగులకు వెల్ బీయింగ్ కింద కొంత మొత్తాన్ని కూడా ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే టెక్ సంస్థలు ఉద్యోగుల విషయంలో చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నాయి. తమ సంస్థలో పని చేసే ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా టీకా తీసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశాయి.
టీకా తీసుకున్న వారిపై చాలా కంపెనీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. మరో పైపు తీసుకోని వారిపై అంతే కఠినంగా వ్యవహరిస్తున్నాయి. గూగుల్ సంస్థ ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు అంతా కచ్చితంగా టీకా తీసుకుని ఉండాలని తెలిపింది. ఇదే జాబితాలో ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ కూడా చేరింది. దీనితో పాటు అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ కూడా ఉద్యోగులు కచ్చితంగా టీకా తీసుకోవాలని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఉద్యోగులు వారి సర్టిఫికేట్ ను వారి వారి హెచ్ఆర్ఎంఎస్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఈ తతంగం అంతా ఈ నెల 14లోపు పూర్తి కావాలని పేర్కొంది.
టీకా తీసుకోవడంలో కానీ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయడంలో అలసత్వం వహిస్తే వారిని వారిని అన్ పెయిడ్ లీవ్ కింద భావించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేగాకుండా ఉద్యోగులు జనవరి చివరిలోగా టీకా తీసుకోకపోతే తొలగించేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. మరో వైపు ఉన్న ఉద్యోగులను మాత్రంమే కాకుండా కొత్తగా తీసుకునే వారికి కూడా కంపెనీలు ఈ నిబంధనలు పెడుతున్నాయి. వారు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే జాబ్ లోకి తీసుకుంటామని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలోనే కాకుండా ఉద్యోగులు లోన్లు, బోనస్ లు, జీతాల చెల్లింపుల విషయంలో కూడా టీకాను తప్పనిసరి చేస్తుంది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా, హై బ్రిడ్ విధానంలో పని చేస్తున్నా కూడా టీకా మస్ట్ అని పేర్కొంటున్నాయి.