రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల.. ఇప్పుడు రెండుతెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారారు. ఆమెకు సంబంధించిన పలు అంశాలు వెలుగు చూస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటివరకు రాని చర్చ కొత్తగా వస్తోంది. వైఎస్ సతీమణి విజయమ్మకు తన ఇద్దరు పిల్లల్లో (జగన్.. షర్మిల) ఎవరంటే ఎక్కువ మక్కువ? అన్నది ఒక ప్రశ్న. వాస్తవానికి ఇది పూర్తిగా కుటుంబ అంశం. కానీ.. ఈ అంశం వెనుక రెండు రాష్ట్ర రాజకీయాలుకూడా ప్రభావితం కావటం ఖాయమైన వేళలో.. ఈ అంశం గురించి మాట్లాడటం తప్పు కాదు.
అలా అని.. విజయమ్మకు జగన్ ఎక్కువ ఇష్టమా? షర్మిల అంటే తక్కువ ఇష్టమా? అన్న విశ్లేషణలు మేం చేయటం లేదు. కాకుంటే.. వారి కుటుంబం గురించి బాగా తెలిసిన అనంతపురం టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. మంగళవారం హైదరాబాద్ లోని సీఎల్పీకి వెళ్లిన జేసీ.. అక్కడ తనను కలిసి కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. వీరి మాటల్లో ఆసక్తికర అంశాలు చాలానే వచ్చాయి.
ఏపీ అధికార.. విపక్షాల గురించి.. ఇద్దరు అధినేతల గురించి మాట్లాడిన జేసీ.. పనిలో పనిగా షర్మిలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలతో పాటు.. తమ లాంటి వారు కూడా ఆగమైనట్లుగా పేర్కొన్నారు. షర్మిల ప్రస్తుతం వార్మప్ చేస్తుందని.. సరిగ్గా ఏడాదిన్నరలో ఆమె ఏపీలో కూడా ఎంటర్ అవుతారన్నారు.
విజయమ్మకు కొడుకు జగన్ కంటే కూడా.. కుమార్తె షర్మిల అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పారు. సీఎం జగన్.. తన చెల్లి షర్మిలకు ఏదైనా పదవి ఇచ్చి ఉంటే.. సమస్యే ఉండేది కాదన్నారు. బీజేపీకి ఏపీలో టీడీపీ మద్దతు లేకుంటే ఒక్క సీటు కూడా వచ్చేది కాదన్న జేసీ.. బాబుకు నోటీసులు ఇప్పుడు ఇవ్వటం పెద్ద విషయమే కాదని తేల్చేశారు. అనంతపురంలో తమ వీపు పగిలినప్పుడే.. బాబుకు నోటీసులు ఇస్తారనుకున్నామని.. రెండేళ్లు ఆలస్యమైందని వ్యాఖ్యానించటం గమనార్హం.