అందుకే అంటారు.. వ్యాపారస్తుడికి సూదిమొనంత దూరే అవకాశం చేస్తే.. దాన్ని దబ్బళంగా చేయటం ఆ తర్వాత రంధ్రాన్ని గొయ్యి మాదిరి చేయటంలో మనోళ్లకున్న టాలెంట్ అంతా ఇంతా కాదు. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ ను తయారు చేసిన రెండు టీకాల్లో కోవాగ్జిన్ ఒకటైతే.. కోవీ షీల్డ్ మరొకటి. వ్యాక్సినేషన్ మూడో దశలతో 18 ఏళ్లక పైబడిన అందరికి టీకా ఇచ్చేయాలని తేల్చేయటం తెలిసిందే.
ముందుగా కేంద్రంలోని మోడీ సర్కారు తాజాగా ఒక ప్రకటన చేస్తూ.. మూడో దశ వ్యాక్సిన్ ప్రైవేటు ఆసుపత్రులు.. రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇలా పలువురికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించారు. అంతకు ముందు ప్రభుత్వంతో పాటు.. కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే వారు. ప్రభుత్వంలో పూర్తిగా ఉచితంగా.. ప్రైవేటులో నామమాత్రపు ధరకు వ్యాక్సిన్ వేశారు.
వ్యాక్సిన్ కోసం జనాల నుంచి డిమాండ్ పెరగటం.. అందుకు తగ్గట్లుగా వ్యాక్సిన్ ను 18 ఏళ్లకు పైబడిన అందరికి ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం తన వాదనను వినిపించింది. ఇప్పటివరకు తమ కనుసన్నల్లో నడిచిన కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రైవేటు సంస్థలు కూడా వేయచ్చని.. అందుకు విడిగా ఛార్జి్ చేయొచ్చన్న పచ్చజెండా ఊపేశారు. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నారో కానీ.. సీరం అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము స్లై చేసే వ్యాక్సిన్ ను కేంద్రానికి రూ.150కు ఇచ్చే కంపెనీ.. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి.. రూ.400.. అదే ప్రైవేటు ఆసుపత్రికి ఇస్తే రూ.600 వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోడీ ఎంత మాట్లాడితే మాత్రం.. అవమీ తల పట్టకుకోకుండా సీరం అధినేత.. పక్కరోజునే బాదేసేలా రేట్లను ప్రకటించటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.
ప్రధాని మోడీ నోటి నుంచి మాట వచ్చిందో లేదో కానీ.. సీరం అధినేత రేట్లను పెంచేసిన తీరు చూస్తే మాత్రం.. రానున్న రోజుల్లో కరోనా పేరుతో చోటు చేసుకునే ఆరాచకాలకు ఇదో చిన్న ఎగ్జాంఫుల్ గా చెప్పొచ్చు. విదేశాల్లో లాభాల పంట పండించేలా ప్లాన్ చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రజలందరికి అందేలా చేయటంలో సీరం నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా తన టీకాల్ని.. ఒక్కోచోట ఒక్కో రేటు పెట్టటం మాత్రంఏ మాత్రం సరికాదంటున్నారు. ఒకే దేశం ఒకే విధానం అనే మోడీ.. వ్యాక్సిన్ విషయానికి ఒకే దేశంలో.. ఒక్కో రేటేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే వారెవరు?