కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే..బీర్ ఫ్రీ..ఎక్కడంటే ?

Update: 2021-04-10 07:38 GMT
మనదేశంలో రోజురోజు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.  మొన్నటి వరకు తగ్గిన కేసులు ప్రస్తుతం బీభత్సంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,45,384 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,32,05,926 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 794  మంది కరోనాతో మృతి చెందారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే.. వ్యాక్సిన్‌ వేసుకోవడానికి చాలా మంది ముందుకు రావడం లేదు.  లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతొక్కరూ టీకా వేయించుకోవాలని ప్రభుత్వాలు ఎంతగా చెప్తున్నా కూడా వినిపించుకోవడం లేదు.

వ్యాక్సిన్‌ వేసుకుంటే.. సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తాయనే అపోహ కారణంగా చాలా మందికి వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రజలకు చైతన్య పరచడానికి.. వారిలో ఉన్న అపోహాలను తొలగించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే  గుజరాత్‌ రాజ్‌కోట్‌కు చెందిన స్వర్ణకారుల సంఘం.. టీకా వేసుకున్న మహిళలకు  బంగారంతో చేసిన ముక్కుపుడకలు, అదే సమయంలో పురుషులకు హ్యాండ్‌ బ్లెండర్లు, ఇతర వంటింటి సామాగ్రిని అందజేస్తోస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఓ రెస్టారెంట్‌ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇది కూడా మందుబాబులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్‌ ప్రకటించింది హార్యానలోని గుర్గావ్‌ సమీపంలోని గోల్డ్‌రోడ్‌లో ఉన్న ఇండియన్‌ గ్రిల్‌ రూం రెస్టారెంట్‌. కరోనా టీకా వేయించుకున్న వారికి బీర్‌ ఉచితంగా ఇస్తామని ప్రకటించేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న కార్డును చూపిన వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, కేవలం వారం రోజులు మాత్రమే ఈ ఆఫర్‌ కొనసాగుతుందని పేర్కొంది ఆ రెస్టారెంట్.  టీకాలు వేయించుకునేలా ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ‘ఇండియన్ గ్రిల్ రూమ్‌తో మీ టీకాను జరుపుకోండి’ అనే కొత్త ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఇక ఇదిలా ఉంటే…కరోనా టీకా వేయించుకున్న వారికి పలు సంస్థలు, వ్యాపారస్తులు వినూత్నంగా బహుమతులను అందచేస్తున్నారు
Tags:    

Similar News