ఐఐటీ ఢిల్లీలోని ఓ అనూహ్యమైన ఆర్డర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంస్థాగతంగా జరిగే కార్యక్రమం గురించి పెట్టిన నోటీసు ఇంతగా వైరల్ అవడానికి కారణం...అందులో అమ్మాయిల వస్త్రాధరణ గురించి ఉండటమే. ఢిల్లీ ఐఐటీలో ఏడాదికి ఒకసారి హౌస్ డే అనే కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా విద్యార్థినులు గంట పాటు అతిథులను హాస్టల్‌కు ఆహ్వానించవచ్చు. ఈ కార్యక్రమం ఈనెల 20వ తేదీన జరగాల్సి ఉంది. దీన్ని పురస్కరించుకునే వార్డెన్ ఒక నోటీస్ పెట్టారు.
ఐఐటీ ఢిల్లీలో హిమాద్రి - కైలాష్ అనే రెండు అమ్మాయిల హాస్టళ్లున్నాయి. హౌస్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి హిమాద్రి హాస్టల్ వద్ద వార్డెన్ సంతకంతో ఓ నోటీసు పెట్టారు. మహిళలు అంతా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే, శుభ్రమైన మంచి పాశ్చాత్య లేదా భారతీయ దుస్తులు ధరించి రావాలని ఆ నోటీసులో తెలిపారు. అయితే దీనిపై కొందరు పెదవి విరిచారు. హాస్టళ్లు - యూనివర్సిటీలు - కాలేజీలలో మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడే పింజ్రా టాడ్ అనే సంస్థ ఈ నోటీసును వాట్సప్ లో అందరికీ షేర్ చేసింది. అంతేకాదు ఈ నిర్ణయం గురించి సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మహిళలు ధరించే దుస్తుల గురించి హాస్టల్ వార్డెన్లు ఎందుకంత కచ్చితంగా వ్యవహరించాలని సంస్థ ప్రశ్నిస్తోంది.
కాగా, ఈ నోటీసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి ఆదేశాలు నోటి మాటగా చెప్పారని పేర్కొంటూ ఇప్పుడు ఏకంగా నోటీసు పెట్టారని బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు అంటున్నారు. అయితే గతంలో ఇలాంటి ఆదేశాల సమయంలో వాటిని పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం వంటివి ఏమీ తీసుకోలేదని పలువురు చెప్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/