శీతాకాలంలో డి విటమిన్ ప్రాముఖ్యత.. అది ఎక్కువగా ఉండే పదార్థాలు ఇవే?

Update: 2021-11-13 02:30 GMT
మనం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం మంచిగా ఉండాలి. అందులో పోషక పదార్ధాలతో పాటు విటమిన్లు కూడా ఉండాలి. జీవక్రియకు విటమిన్ల పాత్ర చాలా కీలకమైనది. అందులోనూ శరీరానికి సంబంధించి డి విటమిన్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ విటమిన్ శరీరానికి తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఒళ్లు నొప్పులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా డి విటమిన్ వల్ల శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది.  

ప్రస్తుతం ఉన్న కరోనా కష్టకాలంలో డి విటమిన్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. వివిధ అధ్యయనాల్లో కూడా ఇదే విషయం వెల్లడైంది. అయితే ఇప్పుడు శీతాకాలం వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.  ఇలాంటి సమయంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశం ఉంది. దీనిని ఎదుర్కొనేందుకు డి విటమిన్ తప్పక తీసుకోవాలి.  అయితే డి విటమిన్ ఎక్కువగా ఏ ఏ పదార్ధాల్లో ఎక్కువగా లభిస్తుంది అనేది ఓ సారి మనం తెలుసుకుందాం.

డి విటమిన్ ఎక్కువగా దొరికే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి జ్యూసులు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి వ్యాధి నిరోధక శక్తి లభిస్తుంది. అందులోనూ ఆరెంజ్ జ్యూస్ ని ఈ రోజు ఓ గ్లాసుకు సరిపడా తీసుకుంటే డి విటమిన్ తో పాటు సి విటమిన్ కూడా లభిస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది.

చలికాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు లాంటి వాటి నుంచి మనం కొంచెం దూరంగా ఉండొచ్చు.  శాఖాహారంలో మాంసం రుచిని ఇచ్చే పుట్టగొడుగులు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కూరగా చేసుకుని తీసుకోవడం వల్ల డి విటమిన్ కావాల్సినంత శరీరానికి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా సూప్ లాగా చేసుకుని దీనిని తీసుకోవడం కూడా ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు.

డి విటమిన్ సమృద్ధిగా లభించే వాటిలో పసుపు కూడా ఒకటి. దీనికి  కొంచెం మసాలా జోడించి తీసుకుంటే డి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది.  ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగడం వల్ల శరీరానికి జబ్బులతో పోరాడేందుకు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.  ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు ఉన్న వాళ్లకి మంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  విటమిన్ డి మరింత ఎక్కువగా ఉండే ఆహారంలో గుడ్డు ఒకటి. దీని లోపలి భాగంలో ఉండే పచ్చసొన శరీరానికి కావాల్సిన డి విటమిన్ ను ఇస్తుంది.

డి విటమిన్ పుష్కలంగా లభించే మరో ఆహార పదార్థం బాదం స్మూతీ. దీనిని పాల, పెరుగు మిశ్రమంగా చేసుకుంటాం. దీనిని తీసుకుంటే శీతాకాలంలో  శరీరానికి కొంత వెచ్చదనం లభిస్తుంది. ఆరోగ్య పరంగా కూడా ఇది చాలా మంచి చేస్తుంది. గోధుమ, బార్లీ వంటి  వాటిలో కూడా డి విటమిన్ లభిస్తుంది. వీటిన తగిన మోతాదులో తీసుకోవడం శీతాకాలంలో చాలా అవసరం. వీటితో పాటే కొన్ని నాన్ వెజ్ పదార్థాల్లో కూడా డి విటమిన్ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల చేపలను తీసుకుంటే శరీరానికి కావాల్సిన డి విటమిన్  దొరుకుతుంది.
Tags:    

Similar News