పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరు ఎత్తితే చాలు ఒంటికాలిపై లేచిపోతుంటాడు పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇనాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్. ఇప్పటికే పలుమార్లు, ముఖ్యంగా పీఓకే లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన అనంతరం షరీఫ్ ను ఏకిపారేసిన ఇమ్రాన్... తాజాగా మరోసారి ఆ పనికి పూనుకున్నారు. పాకిస్థాన్ కు ప్రత్యేకంగా సమస్యలంటూ ఏమీ లేవని, ప్రస్తుత ప్రధానే అసలు సమస్య అని అన్నాడు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ కు రక్షణ సమస్యగా మారాడని.. ఎంతసేపు స్వీయ రక్షణ గురించిన ఆలోచనే తప్ప దేశ రక్షణ విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఈ విషయాలపై మీడియాతో మాట్లాడిన ఇమ్రాన్... షరీఫ్ లక్ష్యమంతా స్వీయ రక్షణ మీదే ఉందని.. షరీఫ్ భారీ అవినీతికి పాల్పడినట్లు పనామా పేపర్ల లీక్ తర్వాత బయటి ప్రపంచానికి తెలిసిందని అన్నారు. ఈ సమయంలో పాక్ సంగతి పక్కనపెట్టి తనను తాను రక్షించుకునే పనిలోనే షరీఫ్ ఉన్నాడని అభిప్రాయపడ్డారు. భారత్ అనుసరిస్తున్న విధానాలను ఒక బలోచిస్థాన్ ముఖ్యమంత్రి ప్రశ్నింస్తుండగా... ప్రధాని హోదాలో ఉన్న షరీఫ్ అంతర్జాతీయ వేదికలపై ఎందుకు ప్రశ్నించడంలేదు. ఇది ఉదాహ్రణ మాత్రం.. ప్రధానిగా షరీఫ్ ఇంకా చాలా విషయాల్లో విఫలమవుతున్నారు అని ఇమ్రాన్ విమర్షించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/