డ్రాగ‌న్ తాజా దుర్మార్గం బ‌య‌ట‌కొచ్చింది

Update: 2017-12-13 04:00 GMT
ప‌క్క‌లో బ‌ల్లెం మాదిరి.. భార‌త్ ప‌ట్ల నిత్యం అంతో ఇంతో విషాన్ని చిమ్మే డ్రాగ‌న్ దుర్మార్గ బుద్ధి ఎంత‌లా ఉంటుంద‌న్న విష‌యాన్ని చెప్పే ఆధారం ఒక‌టి చేతికి వ‌చ్చింది. భార‌త్‌.. చైనా మ‌ధ్య రిలేష‌న్స్ భారీగా దెబ్బ తిన‌టానికి కార‌ణ‌మైన డోక్లాంలో చైనా త‌న వ‌క్ర‌బుద్ధిని ప్ర‌ద‌ర్శించింది.

అయితే.. చైనా దుర్మార్గాన్ని శాటిలైట్ ఫోటోల‌తో సంపాదించింది భార‌త్‌. వివాదాస్ప‌ద‌మైన డోక్లామ్ ప్రాంతంలో వాయు వేగంతో రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు చేప‌ట్టిన‌ట్లుగా శాటిలైట్ చిత్రాలు సాక్ష్యాలుగా అందుబాటులోకి వ‌చ్చాయి. ఇందులో చైనా దుర్మార్గాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తున్న ప‌రిస్థితి.

వివాదాస్ప‌ద ప్రాంత‌మైన డోక్లామ్ లో 13 నెల‌ల క్రిత‌మే రోడ్డు నిర్మాణ ప‌నులు ప్రారంభించిన‌ట్లుగా తాజాగా అందుబాటులోకి వ‌చ్చిన శాటిలైట్ చిత్రాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబ‌రు 17 నుంచి డిసెంబ‌రు 8 మ‌ధ్య తేదీల్లో రోడ్డు నిర్మించిన‌ట్లుగా  స్ప‌ష్టం చేస్తున్నాయి. డోక్లామ్ వివాదం రెండు దేశాల మ‌ధ్య దూరం పెంచ‌ట‌మే కాదు చైనాకు షాకిచ్చేలా మారాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అందుబాటులోకి వ‌చ్చిన శాటిలైట్ చిత్రాల్ని చూస్తే.. మొత్తంగా 7.3 కిలోమీట‌ర్ల మేర రోడ్డు నిర్మించిన వైనం క‌ళ్ల‌కు క‌ట్టినట్లుగా క‌నిపిస్తోంది. మ‌రి.. దీనిపై భార‌త్ రియాక్ష‌న్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News