నాగాలాండ్ కాల్పులపై కీలక ప్రకటన చేసిన హోంమంత్రి అమిత్ షా

Update: 2021-12-06 15:04 GMT
ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో సామాన్య పౌరులపై తీవ్ర వాదులు అనుకొని కాల్పులు జరిగిన భారత సైన్యం ఘటన ఆ రాష్ట్రాన్ని అట్టుడికిస్తోంది. దేశవ్యాప్తంగా దీనిపై నిరసన వ్యక్తం అవుతోంది. ఈ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్ సభలో వివరణ ఇచ్చారు. తీవ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని తెలిపారు. సైన్యం పొరపాటుకు కేంద్రం పశ్చాత్తాప పడుతోందని అన్నారు. ఈ ఘటనపై సిట్ ఎర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఉగ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు కాల్పులు జరిపారని అమిత్ షా తెలిపారు. అనంతరం దాడికి పెద్ద ఎత్తున వచ్చిన గ్రామస్థుల నుంచి తమను తాము కాపాడుకోవడం కోసమే సైనికులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని అందులో పలువురు చనిపోయారని అమిత్ షా తెలిపారు.నాగాలాండ్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

ఈ ఘటనపై తాము విచారణకు ఆదేశించగా సైన్యం పొరపాటుగా కాల్పులు జరిపినట్లుగా విచారణలో తేలిందని కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

సాధారణ పౌరులు చనిపోయిన విషయంపై ఇప్పటికే నాగాలాండ్ ఉన్నతాధికారులతో తాము మాట్లాడామని ప్రతిపక్షాలు ఈ ఘటనను అడ్డం పెట్టుకొని విమర్శలు చేయడం తగదని అమిత్ షా హితవు పలికారు.
Tags:    

Similar News