రాజస్థాన్ లోని రాజసమంద్ లో దారుణం జరిగింది. `లవ్ జిహాద్` పేరుతో శంభునాథ్ రాయ్ గర్ అనే వ్యక్తి....షేక్ భట్టా అనే వ్యక్తిని పట్టపగలే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పదునైన ఆయుధాలతో కర్కశంగా కొట్టి చంపాడు. అంతేకాకుండా - భట్టాను సజీవ దహనం చేశాడు. అంతటితో ఆగకుండా , ఆ అకృత్యాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. `లవ్ జిహాద్` కు పాల్పడ్డవారందరికీ ఇదే గతి పడుతుందని అతడు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రోజు ఉదయం ఈ దారుణానికి ఒడిగట్టిన శంభునాథ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, లవ్ జిహాద్ నుంచి ఓ మహిళను రక్షించేందుకే తానీ హత్యకు పాల్పడ్డానని శంభునాథ్ చెబుతున్నాడు. అతడు చేసిన దారుణాన్ని సమర్థించుకున్నాడు.
ముందు జాగ్రత్త చర్యగా రాజసమంద్ లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసినట్లు రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. ఈ ఘటనపై కటారియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. తన తండ్రికి అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటో తెలియదని, కూలీ పని ఇప్పిస్తానని తీసుకెళ్లిన శంభునాథ్ తన తండ్రిని అత్యంత పాశవికంగా హత్య చేశాడని భట్టా కూతురు ఆరోపించింది. అమాయకుడైన తన తండ్రిని పొట్టనబెట్టుకున్న శంభునాథ్ కు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. అయితే, ఈ ఘటనపై మరో సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. ఇది లవ్ జిహాద్ నేపథ్యంలో జరిగిన హత్య కాదని వదంతులు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భట్టా.... ఓ మహిళతో కలిసి జీవిస్తున్నాడు. గతంలో ఆమె శంభునాథ్ ప్రేయసి అని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. తన మాజీ ప్రేయసితో భట్టా కలిసి జీవించడాన్ని జీర్ణించుకోలేని శంభునాథ్ వ్యక్తిగత కక్ష్యతోనే హత్య చేసి దానికి లవ్ జిహాద్ హత్యగా చిత్రీకరించాడని తెలుస్తోంది. ముక్కోణపు ప్రేమ కథ, అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ దారుణం జరిగిందని అనధికారిక వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Full View