ఆయన వైసీపీ రెబెల్ ఎంపీ. ఆయన ఏపీకి చెందిన వారు. ఆయన గురించి ఇపుడు ఎక్కువగా తెలంగాణాలో చర్చ సాగుతోంది. ఫాం హౌస్ లో జరిగిన టీయారెస్ ఎమ్మెల్యేల ఆపరేషన్ కాదు కానీ బీజేపీ మీద టీఆర్ఎస్ మంత్రులు నాయకులు తెగ దూకుడు చేస్తున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే మధ్యలోని రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజుని తెచ్చి ఆయన్ని బదనాం చేస్తున్నారు.
ఫాం హౌస్ ఆపరేషన్ లో రామచంద్రభారతి చెప్పిన అనేక విషయాలలో ఏపీలోని వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజుకు కేంద్రం భద్రత కల్పించిందని, ఆయనను బాగా చూసుకుంటోందని చెబుతూ తమ వైపు వస్తే అలాగే చూసుకుంటామని హామీ ఇచ్చే సందర్భంలో ఆయన ప్రస్థావన తెచ్చారని ప్రచారం సాగింది.
ఇపుడు ఏకంగా టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. మీకు ప్రజాస్వామిక విలువలు లేవు, ఈ రకమైన నియమాలు నిబంధనలూ లేవు అని అంటూ ఒక ఎంపీ మీద అనర్హత వేటు వేయమని స్పీకర్ కి ఫిర్యాదు చేసినా రెండున్నరేళ్ళుగా ఏం చర్యలు తీసుకున్నారంటూ హరీష్ రావు రెట్టించి అడుగుతున్నారు.
రూల్స్ అన్నీ మీకు అవసరం అయితేనే ఉంటాయా అపుడే వాటిని బయటకు తీస్తారా అని ఆయన బీజేపీని ప్రశ్నించారు. రెబెల్ ఎంపీ మీద చర్యలను పూర్తిగా నానబెట్టి బీజేపీ మార్క్ ప్రజాస్వామ్యం చూపిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. అదే టైం లో గుజరాత్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద మాత్రం తమకు రాజకీయ అవసరం కాబట్టి వెంటనే చర్యలు తీసుకున్నారని దేశంలో చాలా రాష్ట్రాలలో దొడ్డి దారిన బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇలాంటి చర్యల వల్లనే అని ఆయన ఫైఅర్ అయ్యారు.
సరే హరీష్ రావు ఆవేశం అంతా బీజేపీ మీద చూపించినా మధ్యలో వైసీపీ రెబెల్ ఎంపీ రాజు గారు ఇక్కడ అడ్డంగా దొరికారు అని అంటున్నారు. ఆయనకు బీజేపీ కాపు కాస్తూ రక్షిస్తోందన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ ఫాం హౌస్ ఆపరేషన్ తో అది బయటపడిందని అంటున్నారు.
వారూ వీరూ విమర్శలు చేసుకుంటూ మధ్యలో ప్రతీ రోజూ రఘురామను బాగా కెలుకుతున్నారని అంటున్నారు. దాని వల్ల ఆయన అనర్హత ఎంపీగా జనం ముందుకు ఆయన చర్చకు మళ్ళీ వచ్చేలా చేస్తున్నారు. నిజానికి ఆయన అనర్హత పిటిషన్ గురించి వైసీపీయే మరచిపోయింది కానీ ఇపుడు టీఆర్ఎస్ రచ్చతో రాజు గారు పరేషాన్ అవుతున్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.