అప్పుడెప్పుడో రాసిన యుద్ధము-శాంతి నవల ఇప్పటికీ చాలా ఫేమస్ అలాంటిదే తొందరలో యుద్ధం-ప్రేమ అనే పేరుతో ఎవరైనా నవల రాస్తారేమో. ఇంతకీ విషయం ఏమిటంటే రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశం సర్వనాశనమై పోతుంది. ఇప్పటికే దేశంలోని చాలా నగరాలు ద్వంసమైపోయాయి. ఇలాంటి సమయంలోనే హఠాత్తుగా పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. అది కూడా ప్రేమ పెళ్ళిళ్ళు జరిగిపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
దీనికి కారణం ఏమిటంటే యుద్ధం జరగకపోయుంటే ఇప్పటికే వేలాది జంటల వివాహాలు జరిగుండేవట. కారణం ఏమిటంటే వీళ్ళందరు ఎప్పటినుండో ప్రేమించుకుంటున్నారు. వివాహ బంధంతో ఏకమయ్యేందుకు తేదీలను కూడా నిర్ణయించుకున్నారు. ఇంతలో హఠాత్తుగా రష్యా తన సైన్యంతో విరుచుకుపడింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక పోవడంతో పాటు చాలా ప్రభుత్వ ఆఫీసులు ధ్వంసమైపోయాయి.
అందుకని జన జీవితాలు ఎక్కడివక్కడే స్తంభించిపోయాయి. ఇప్పటికే లక్షలాది మంది జనాలు చనిపోయారు. ఇదంతా చూసిన తర్వాత ఎవరెంత కాలం జీవించుంటారో ఎవరు చెప్పలేమనే నిరసన పెరిగిపోతోంది. ఇందులో నుండే వివాహాలు చేసుకోవాలనే ఆలోచన బయలుదేరింది. బతికున్న నాలుగు రోజులైనా వివాహ బంధంతో కలిసుందామనే ఆలోచన యువతలో పెరిగిపోతోందట. ఇందుకు ప్రభుత్వం కూడా ఆమోదించిందట. దాంతో పెళ్ళిళ్ళు చేసుకోవటం ఒక్కసారిగా పెరిగిపోయాయి.
మామూలుగా అయితే వివాహ ప్రక్రియకు నోటీసు ఇచ్చిన దగ్గర నుంచి నెల రోజులు పడుతుందట. కానీ యుద్ధం కారణంగా దీన్ని 24 గంటలకు కుదించింది ప్రభుత్వం. దాంతో రాజధాని కీవ్ లోనే నాలుగు వేల ప్రేమ జంటలు వివాహాలు చేసుకున్నాయి. వివాహాలు చేసుకున్న వారిలో సైనికులు కూడా ఉన్నారట. యుద్ధం కారణంగా ఫిబ్రవరి నుండి వివాహాల రిజిస్ట్రేషన్ జరగలేదు.
ఎప్పుడైతే ప్రభుత్వం ప్రత్యేక నిబంధనల కింద వివాహాలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో ఇపుడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఊపందుకుందట. అందుకనే కీవ్ లోనే 4వేల పెళ్ళిళ్ళు జరిగాయి. మరి దేశమంతా ఎన్ని వేల పెళ్ళిళ్ళు జరిగాయో ఇంకా లెక్కలు అందలేదు.
ఒకవైపు యుద్ధంలో సైనికులు చనిపోతున్నాసరే లెక్కచేయకుండా సైనికులను వివాహం చేసుకునేందుకు ఆడ/మగ ముందుకొస్తుండటం ఆశ్చర్యంగానే ఉంది. మొత్తానికి ఉక్రెయిన్ లో ఒకవైపు యుద్ధం మరోవైపు ప్రేమపెళ్ళిళ్ళు జరుగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.