IND vs PAK: వరల్డ్ కప్ లో ఎవరెన్ని మ్యాచులు గెలిచారో తెలుసా?

Update: 2022-10-23 05:38 GMT
టీ20 వరల్డ్ కప్ లోనే హైయెస్ట్ హై ఓల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోని కోట్లాది మంది టీవీల్లో లైవ్ చూడడానికి.. ఇక స్టేడియంలో లక్షమంది చూడడానికి రెడీ అయ్యారు. రెండు శత్రుదేశాల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ అంటేనే రెండు దేశాలకే కాదు.. ప్రపంచానికి కూడా ఓ పెద్ద ఎమోషన్. అది ప్రపంచకప్ సమరం కాబట్టి మరింత హీటెక్కనుంది.

ఇప్పటివరకు ఈ రెండు దేశాల మధ్య వన్డే, టీ20 వరల్డ్ కప్ లో కలిపి 13 మ్యాచులు జరిగాయి. 12 విజయాలతో భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. అయితే గతేడాది వరల్డ్ కప్ లో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది.

టీ20 ఇంటర్నేషనల్స్ లో భారత్, పాకిస్తాన్  మధ్య ఇప్పటివరకూ మొత్తం 11 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో భారత్ 8 మ్యాచులు గెలవగా.. పాకిస్తాన్ 3 విజయాలు సాధించింది. టీ20 ప్రపంచకప్ లో భారత్ 6 మ్యాచుల్లో వరుసగా 5 మ్యాచ్ లు గెలుపొందగా.. గత ఏడాది పాకిస్తాన్ తొలి విజయాన్ని అందుకుంది. చివరి 3 మ్యాచ్ ల గురించి చెప్పాలంటే పాకిస్తాన్ ముందుంది. పాక్ 2 మ్యాచ్ లు గెలవగా.. భారత్ ఒక మ్యాచ్లో విజయం సాధించింది.

జట్ల బలాబలాల విషయానికి వస్తే.. ప్రపంచకప్ వన్డే అయినా.. టీ20 అయినా ఇప్పటివరకూ పాకిస్తాన్పై టీమిండియాదే పైచేయి. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్ ను పాకిస్తాన్ చిత్తు చేసింది. ఇప్పుడు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. తద్వారా ప్రతిష్టాత్మక టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తోంది.

జస్ప్రీత్ బుమ్రా గాయంతో తప్పుకోవడంతో భారత్ బౌలింగ్ భారమంతా మహ్మద్ షమీపైనే పడనుంది. భువనేశ్వర్ కుమార్ పై కూడా బోలెడు ఆశలున్నాయి. ముగ్గురు మేజర్ పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగనుంది. చివరి ఓవర్ల బలహీనతను భారత్ జట్టు ఎదుర్కోగలదా? లేదా? అనే దానిపైనే దృష్టి ఉంటుంది.

ఇక బౌలింగ్ కొంచెం ఆందోళన కలిగించే విసయం కానీ.. బ్యాటింగ్ లో కూడా జాగ్రత్తగా ఉండాలి. షాహీన్ షా ఆఫ్రిదీని భారత్ టాప్ ఆర్డర్ ఎలా ఎదుర్కోగలదనేది అతిపెద్ద ప్రశ్న. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ రాణించడం అత్యంత కీలకం. టీం భారీగా పరుగులు సాధిస్తే విజయం సులువు అవుతుంది.
Tags:    

Similar News