టీకా పంపిణీలో మరో రికార్డుకు చేరువలో భారత్‌

Update: 2022-05-21 04:30 GMT
ప్రపంచానికి వణుకు పుట్టించిన కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతోంది.

కరోనా టీకా పంపిణీ కార్యక్రమంలో భారతదేశం మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. త్వరలోనే 200 కోట్ల డోసుల మైలురాయిని భారత్ చేరుకోనుంది.

2021 జనవరి 16న ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,91,96,32,518కు చేరింది. దేశవ్యాప్తంగా గురువారం 15,12,766 మందికిపైగా టీకాలు అందించారు. ఆ ఒక్కరోజే 4,51,179 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

భారత్‌లో ఇప్పడి వరకు కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో ప్రతిరోజు కేసులు 3వేల కంటే తక్కువగానే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గురువారం 2,259 కేసులు నమోదయ్యాయి. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒక్కరోజే 2,614 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. డైలీ పాజిటివీటి రేటు 0.50 శాతంగా నమోదైనట్లు తెలిపింది. భారత్‌లో ఇప్పటి వరకు 5.24లక్షల మందిని మహమ్మారి బలి తీసుకుంది.
Tags:    

Similar News