వారంలోపు అభినంద‌న్ ను పంపించండి!

Update: 2019-02-28 08:12 GMT
పాక్ లో చిక్కుకున్న వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ధ‌న్ విడుద‌ల‌పై భార‌త్ ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేసింది. దౌత్య‌ప‌ర‌మైన ఒత్తిడిని పెంచుతోంది. అత‌డ్ని వారంలోపు విడుద‌ల చేయాల‌ని భార‌త విదేశాంగ శాఖ లేఖ రాసింది. జెనీవా ఒప్పందం ప్ర‌కారం అత‌డికి ఎలాంటి హాని త‌ల‌పెట్టొద్ద‌ని పాక్ ను కోరింది.

అదే స‌మ‌యంలో పాక్ లో ఉన్న‌ జేషే ఎ మ‌హ్మ‌ద్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. పుల్వామా ఉగ్ర‌దాడిలో అత‌డి పాత్ర‌కు సంబంధించిన ఆధారాల్ని భార‌త్ స‌మ‌ర్పించింది. ఇదే స‌మ‌యంలో భార‌త్ తో పాటు ప్ర‌పంచ దేశాలు ఉగ్ర‌వాదంపై పాక్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాయి.

అమెరికా కూడా ఈ విష‌యంలో భార‌త్‌ కు  స‌పోర్ట్ చేసింది. పీవోకేలో ఉగ్ర‌శిబిరాల‌పై భార‌త ఎయిర్ ఫోర్స్ వింగ్ చేసిన దాడుల్ని అమెరికా స‌మ‌ర్థించింది. ఇదిలా ఉండగా ఈ సాయంత్రం కేంద్ర కేబినెట్ కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈ భేటీలో పాక్ లో ఉన్న అభినంద‌న్ ను వెన‌క్కి తెచ్చే విష‌యంపైనా.. తాజా ప‌రిణామాలపై చ‌ర్చ జ‌ర‌ప‌నున్నారు.


Tags:    

Similar News