రాహుల్ ద్రవిడ్ శిక్షణలో రాటుదేలిన కుర్ర జట్టు.. అంచనాల్ని అందుకుంది. తిరుగులేని ఆధిపత్యంతో అండర్-19 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత యువ జట్టు 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సగర్వంగా ప్రపంచకప్ ను అందుకుంది. అండర్-19 క్రికెట్లో అత్యధిక సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టు భారతే కావడం విశేషం. ఇంతకుముందు ఆస్ట్రేలియాతో సమానంగా భారత్ మూడుసార్లు విజేతగా నిలిచింది. తాజా విజయంతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరింది భారత జట్టు. భారత్ ఇంతకుముందు 2000.. 2008.. 2012ల్లో అండర్-19 ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ లోనూ ఓడలేదు. పైగా ప్రతి మ్యాచ్ లోనూ భారీ విజయమే సాధించింది. ఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియాను టోర్నీ తొలి మ్యాచ్ లోనే ఢీకొన్న భారత్ 100 పరుగుల తేడాతో చిత్తు చేయడం విశేషం.
ఫైనల్లో భారత్‌కు ఎదురే లేదు. మొదట భారత బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటైంది. 76 పరుగులు చేసిన మెల్రో మినహా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్ (2/30) - శివ సింగ్ (2/36) - కమ్లేష్ నాగర్ కోటి (2/41) - అనుకుల్ రాయ్ (2/32) సత్తా చాటారు. అనంతరం భారత్ 38.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యువ ఓపెనర్ మన్ జ్యోత్ కల్రా అజేయ సెంచరీతో జట్టుకు ఘనవిజయాన్నందించాడు. 102 బంతులెదుర్కొన్న కల్రా 8 ఫోర్లు.. 3 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 29 పరుగులు చేయగా.. టోర్నీలో పరుగుల వరద పారించిన శుభ్ మన్ గిల్ 31 పరుగులు సాధించాడు. హర్విక్ దేశాయ్ 47 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలిచాడు. కల్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా.. శుభ్ మన్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.