మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపుగా అందరూ ఏదో ఒక స్థాయిలో ఇబ్బంది పడుతున్నవారే కానీ.. మోడీ నిర్ణయం మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం కావడంతో దేశం యావత్తు ఆయన వెంట నిలిచింది. ఎక్కడా ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. ఇబ్బందులు పడుతున్నా సహనంతోనే ఉన్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గంటలకు గంటలు నిల్చుంటున్నా ఎవరూ పల్లెత్తి మాటనడం లేదు... ఆందోళనలకు దిగడం లేదు.. దొంగతనాలు, లూటీలకు దిగడం లేదు. కానీ... మన తరువాత పెద్ద నోట్లు రద్దు చేసి వెనెజులాలో మాత్రం రచ్చరచ్చ జరుగుతోంది.
వెనిజులాలోనూ ఇటీవలే వంద బొలివర్ నోట్లను రద్దు చేశారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి మూడు రోజుల్లోగా పాత నోట్లను మార్చుకోవాలని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు. ఈ రోజుతో ఆ గడువు ముగుస్తుంది. అయితే, పెద్దనోటు రద్దు నేపథ్యంలో ఆ దేశ ప్రజలు మండిపడుతున్నారు. కొత్త నోట్లు దొరక్క, పాత నోట్లు చెల్లక ఏం చేయాలో తెలియక డెలివరీ ట్రక్కులను దోచుకుంటుంటూ పోలీసులతో గొడవలకు దిగుతున్నారు. తమదేశంలో 100 బొలివర్ నోట్లను రద్దు చేసిన ఆ దేశ ప్రభుత్వం ఆ స్థానంలో వాటి విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ నోట్లు అందుబాటులోకి తీసుకు రావాలని చూస్తోంది. అయితే, ఆ నోట్లు ఇప్పటివరకు సామాన్యులకు అందలేదు.
సరఫరా చేయడానికి కొత్తనోట్లను సిద్ధం చేయకముందే ముందు జాగ్రత్తలేమీ తీసుకోకుండానే 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రకటించారు. 100 బొలివర్ విలువ అమెరికా కరెన్సీలో మూడు సెంట్లు మాత్రమే విలువ చేస్తుంది. ఆ దేశంలో ఆ నోట్లు 77 శాతం వరకు చలామణీలో ఉండేవి. ఒక్కసారిగా వాటిని రద్దు చేయడంతో మరి కొన్ని రోజుల్లో క్రిస్మస్ పండుగ రానుండడం వారి కష్టాలను మరింత పెంచేసింది. కనీసం ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి కూడా జనం దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆందోళనలకు దిగడమే కాకుండా లూటీలకు పాల్పడతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/