దేశం వెలిగిపోతోంది. దూసుకుని పోతోంది. ప్రపంచ దేశాల సరసన ఉన్నది భారతే. అంతర్జాతీయంగా బలమైన దేశం భారత్ అంటూ కమలనాధులు తెగ ఊదరగొడతారు. కానీ వాస్తవంగా అలా జరుగుతోందా. ఉక్కు మనిషి, బలమైన నేత ఇంటర్నేషనల్ ఫేం నేం అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ సాబ్ ఏలుబడిలో దేశం ఏ విధంగా అభివృద్ధి సాధించింది అన్నది కనుక చిట్టా పద్దులు తీస్తే అభివృద్ధి మాట ఏమో కానీ అప్పులు మాత్రం గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్నాయి.
ఈ దేశానికి ఉన్న అప్పు ఈ రోజుకి అక్షరాలా ఎంతో తెలుసా. ఏకంగా 138 లక్షల కోట్ల రూపాయలు. ఈ దేశం లో 138 కోట్ల జనాభా ఉంటే అప్పుల నంబర్ కూడా దాదాపుగా అంతే ఉంది. అంటే ప్రతీ వ్యక్తి మీద తట్టెడు అప్పు ఉంది. ఇదంతా మోడీ సర్కార్ ఏలుబడిలో దేశం సాధించిన ప్రగతి అని చెప్పుకోవాలని అంటున్నారు. ఈ దేశానికి ఉన్న అంతర్గత అప్పులు ప్లస్ విదేశీ రుణాలు రెండూ కలిపితే ఈ నంబర్ వచ్చింది. ఇది ఇంకా పెరిగేదే కానీ తగ్గేది కాదు.
ఏ ఏటికి ఆ ఏడు ఇలా అప్పులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చూస్తే 2014 ముందు దాకా ఉన్న ప్రభుత్వాలు అన్నీ కలసి చేసిన అప్పులు అరవై లక్షల కోట్ల రూపాయల అప్పులు అయితే దాన్ని గత ఎనిమిదిన్నర ఏళ్ల పాలనలో మోడీ సర్కార్ రెట్టింపు చేశారు అని ప్రతిపక్షాలు ఊరకే అనడంలేదు అని ఈ లెక్కలను చూస్తే అర్ధమవుతోంది.
ముఖ్యంగా చూస్తే 2014-15 ఆర్ధిక సంవత్సరం నాటికి అంటే మోడీ ప్రధాని గా మొదటి సారి అధికారంలోకి వచ్చేనాటికి దేశానికి ఉన్న అప్పులు అక్షరాలా 62.44 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది కాస్తా 2021-22 ఆర్ధిక సంవత్సరానికి 138 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది ఎవరో చెప్పిన లెక్క కాదు, ఎవరో చేసిన విమర్శ అంతకంటే కాదు. సాక్షాత్తూ లోక్ సభలో కేంద్రం అందించిన అప్పుల వివరలే.
ఇక ఇందులో దేశ అంతర్గత అప్పులు చూస్తే 114.62 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే ఇక దీనికి విదేశీ రుణాన్ని జమ కడితే అది 6.59 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఇతర రుణాలు కూడా చూస్తే అది 17.67 లక్షల కోట్ల రూపాయలు ఉంది. టోటల్ ఇదన్న మాట. ఇంత క్లారిటీగా కేంద్రం లోక్ సభలో లెక్కలు చెప్పాక దేశం అభివృద్ధి ఏంటి అంటే జవాబు ఎవరికైనా వెరీ సింపుల్ కదా మరి.
ఎక్కడి 62 లక్షల కోట్లు, ఎక్కడ 138 లక్షల కోట్లు. రెట్టింపు కూడా దాటిపోయింది కదా. మోడీకి ముందు 67 ఏళ్ళ పాటు వివిధ ప్రభుత్వాలు ఏలి కూడా సగం కంటే తక్కువ అప్పు చేస్తే కేవలం ఎనిమిదేళ్ళలో దానికి రెట్టింపు చేయడం అంటే ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ ఎటు పోతోంది అన్న చర్చ అయితే రాక మానదు. పైగా ఈ దేశంలో అభివృద్ధి విషయంగా చూస్తే పెద్దగా జరిగింది లేదు. కొత్తగా ప్రాజెక్టులు రాలేదు, పరిశ్రమలు రాలేదు, మరో వైపు ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ప్రైవేట్ పరం చేస్తునారు ఆఖరుకు విమానాశ్రయాలు కూడా అమ్మకానికి పెడుతున్నారు.
పన్నులు వాయించేస్తున్నారు. జీఎస్టీ పేరు చెప్పి భారీగా వడ్డన వడ్డిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ బాదుడు కూడా అంతే స్థాయిలో ఉంది. దేశంలో నిరుద్యోగం పెరిగింది. బీదరికం ఇంకా అలాగే ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి ఎందులో పెట్టారు, దేనికి వెచ్చించారు అంటే జవాబు ఉందా అన్నదే చూడాలి. రాష్ట్రాలు అప్పులు చేస్తే అదమాయిస్తూ కళ్ళెం వేస్తున్న కేంద్రం తన అప్పులకు మాత్రం హద్దూ పద్దూ లేకుండా ముందుకు పోతుంటే రేపటి రోజున అభివృద్ధి భారతం అంటే అప్పుల భారతం అని అర్ధం చదువుకోవాల్సి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.