ప్రధాని నరేంద్రమోడీ దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్ డౌన్ ను ఇప్పటికే మూడు సార్లు పొడిగించారు. ప్రస్తుతం మే 17వరకు దేశంలో లాక్ డౌన్ ను విస్తరించారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ ను ఈ నెలాఖరు దాకా పొడిగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈనెల 17వ తేదీతో ముగియనున్న లాక్ డౌన్ ను మరికొన్ని సడలింపులతో మరో 2 వారాల పాటు కొనసాగించడానికే ప్రధాని మోడీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే రెడ్ జోన్లు మినహా గ్రీన్ - ఆరెంజ్ జోన్లలో బోలెడు మినహాయింపులను కేంద్రం ఇచ్చింది. మద్యం అమ్మకాలకు తెరతీశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపుతప్పాయి. మద్యం కోసం జనాలు లాక్ డౌన్ నిబంధనలు గాలికొదిలేసి ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా ఎగబడ్డారు. కరోనా వ్యాప్తికి దోహదపడ్డారు. రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై పీఎంవో నిఘా వర్గాల ద్వారా ఆరాతీసిన ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్షించినట్టు తెలిసింది.
లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయకపోవడం వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు అధికారులు ప్రధాని మోడీకి వివరించారట.. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగించాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.