ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో ఐటి ఉద్యోగులు సంఘటితమై ''ఫోరం ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్, తమిళనాడు'' పేరుతో సంఘం స్థాపించుకున్నారు.
ఈ మేరకు 100 మందికిపైగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సభ్యులుగా సంతకాలు చేశారు. మహిళా ఉద్యోగినులకు భద్రత, ఐటీ సంస్థల్లో కార్మిక చట్టాల అమలు, ఉద్యోగుల హక్కులను కాపాడడం కోసం సంస్థ పనిచేస్తుందని యూనియన్ నాయకురాలు పీ పరిమళ తెలిపారు.
తమిళనాడులో దాదాపు 4.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఐటీ రంగంలో నెలకొన్న ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో అనేక మందిపై ఉద్యోగం తొలగింపు కత్తి వేలాడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొందరు తమిళనాడు రాష్ట్ర కార్మిక శాఖను ఆశ్రయించారు. అయితే తమ పోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. కాగా, ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది యూనియన్‌లో చేరడానికి ఇష్టపడడం లేదని సమాచారం. యూనియన్ లో చేరితే తాము పనిచేస్తున్న సంస్థల నుంచి అనవసరమైన ఇబ్బందులు వస్తాయని ఉద్యోగులు భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు తమ వద్దకు వచ్చి సమస్యలు విన్నవించుకునే ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఫైట్ సంస్థ ప్రకటించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/