దేశంలో అక్రమాలకు పాల్పడి - ప్రభుత్వానికి పన్నున కట్టకుండా కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్న వారు నల్ల కుబేరులుగా విలాసంగా జీవిస్తున్నారు. ఇలా సంపాదించిన సొమ్మునంతా... వారు స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంకుకు తరలిస్తున్నారు. ఆ దేశంలోని చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న నల్ల కుబేరులు... దేశంలో అక్రమంగా సంపాదించిన సొమ్మును నిర్భయంగా అక్కడికి తరలించేస్తున్నారు. అయితే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక... ఈ తరహా నల్ల ధనం వివరాలన్నింటినీ తమకు అందించాలని భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ సర్కారును కోరింది. మోదీ ప్రధాని కాకముందే ఈ తరహా చర్యలు ప్రారంభమైనా... బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాకే ఈ దిశగా భారత్ స్పీడు పెంచింది.
దఫదఫాలుగా జరిగిన చర్చల ఫలితంగా భారత్ కోరిన మేరకు తమ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్ల ధనం వివరాల వెల్లడికి స్విట్జర్లాండ్ ఒప్పుకుంది. ఈ మేరకు నిన్న ఆ దేశం నుంచి అధికారిక ఉత్తర్వు వెలువడింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... ఆ దేశంలోని బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ముకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి అందనున్నాయి. 2018 నుంచి అమల్లోకి రానున్న ఈ ఒప్పందంతో తొలి దశ వివరాలు 2019లో భారత్ కు అందనున్నాయి.
ఆటోమేటిక్ ఎక్సేంజీ ఫైనాన్సియల్ అకౌంట్ (ఏఈఓఐ) పేరిట రూపొందిన ఈ ఒప్పందం ప్రకారం 2018 తర్వాత ఎప్పటికప్పుడు ఈ తరహా వివరాలను భారత్‌కు స్విట్జర్లాండ్ అందిస్తూనే ఉంటుంది. స్విట్జర్లాండ్ కౌన్సిల్ ఆమోదించిన ముసాయిదా నివేదిక ప్రకారం తాజా నిర్ణయంపై ఇక రిఫరెండం ఉండదు. అందువల్ల ఒప్పందం అమలులో విధానపరంగా ఎలాంటి జాప్యం జరిగే అవకాశముండదట.నల్లధనానికి సంబంధించిన సమాచారం ఆయా దేశాలకు అవసరమా? కాదా? అన్న విషయం సరిచూసుకున్నాకే ఫెడరల్ కౌన్సిల్ సమాచారాన్ని అందించనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/