ప్రస్తుత ఆపత్కాలంలో భారతదేశం ప్రపంచదేశాలకు సంజీవనిగా మారింది. ప్రపంచదేశాలన్నీ భారతదేశ సహాయం పొందుతున్నాయి. సహజ వనరులతో పాటు మానవ వనరులతో అలరారుతున్న భారతదేశంలో ఉత్పత్తులు.. వస్తువులు.. సేవలు భారీగా ఉన్నాయి. వాటిలో వ్యాక్సిన్లు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే అమెరికా తదితర దేశాలకు మందులు సహాయం చేసిన భారత్ తాజాగా ఉత్తర కొరియాకు కూడా సహాయం చేసింది. ఊహించని రీతిలో ఆ దేశానికి భారీ వైద్య సాయం అందజేసింది. సుమారు 10 లక్షల డాలర్ల విలువైన యాంటీ-ట్యుబర్ కోలోసిస్ (క్షయ వ్యాధి నివారణ) మందులను ఉత్తర కొరియాకు పంపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని భారత్ మానవతా దృక్పథం చాటుకుంది. అందులో భాగంగానే ఈ సహాయం చేసినట్టు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ ఎప్పటి నుంచో కొరియా దేశాలకు యాంటీ ట్యూబర్ కొలోసిస్ మందుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో ఆ అంతర్జాతీయ సంస్థ సూచన మేరకు ఈ మందులను ఉత్తర కొరియాకు పంపగా.. ఉత్తర కొరియాలో ఉన్న భారత రాయబారి అతుల్ మల్హరి అక్కడి ప్రభుత్వానికి ఈ మందులను అందజేశారు.