పొరుగుదేశం చైనా ఇన్నాళ్లు పరోక్షంగా ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నం చేయగా ఇపుడు ఏకంగా మన దేశానికి హెచ్చరికలు జారీ చేసే స్థాయికి చేరింది. తమ ప్రత్యేక విధానమైన వన్ చైనా పాలసీని గౌరవించాల్సిందేనని భారత్‌కు చైనా తేల్చి చెప్పింది. తైవాన్ ఎంపీల భారత పర్యటనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై ఇప్పటికే తమ నిరసనను భారత విదేశాంగ శాఖ దగ్గర లేవనెత్తినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షుంగ్ వెల్లడించారు.తైవాన్‌తో సంబంధాలపై భారత్ పునరాలోచన చేయాలని, వన్ చైనా పాలసీని గౌరవించాల్సిన అవసరం ఉన్నదని గెంగ్ షుంగ్ స్పష్టంచేశారు. ఇండియా నిప్పుతో చెలగాటమాడుతోందంటూ చైనీస్ మీడియా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తమతో దౌత్య సంబంధాలు ఉన్న ఏ దేశమైనా తైవాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించడాన్ని చైనా జీర్ణించుకోలేదు. తైవాన్‌ను ఇప్పటికీ తమ భూభాగంలో భాగంగానే చైనా భావిస్తోంది. అవసరమైతే బలప్రయోగంతోనైనా తైవాన్‌ను తమలో కలుపుకోవాలన్నది చైనా ఆలోచన. ఈ విషయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోనూ చైనా కయ్యానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఇండియా మాత్రం చైనా ఆరోపణలను తిప్పికొట్టింది. తైవాన్ ఎంపీల తాజా పర్యటనలో విశేషమేమీ లేదని, గతంలోనూ ఇలాంటి పర్యటనలు ఎన్నో చేశారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. మూడు రోజుల పర్యటన కోసం ముగ్గురు సభ్యుల తైవాన్ ప్రతినిధి బృందం సోమవారం భారత్‌కు వచ్చింది. ఈ పర్యటకు వచ్చిన వారిలో ఒకరైన కువాన్ బి లింగ్ మాట్లాడుతూ.. తైవాన్ పూర్తి స్వతంత్ర దేశమని చెప్పడం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/