భారత్ కు బుల్లెట్ ట్రైన్ ఎప్పటికి వస్తుంది..?

Update: 2015-12-13 05:08 GMT
భారత్ లో పర్యటిస్తున్న జపాన్ ప్రధాని షింజో అబె .. తన పర్యటనలో అత్యంత కీలకమైన బుల్లెట్ ట్రైన్ కు సంబంధించి భారీ ఒప్పందం చేసుకోవటం తెలిసిందే. ఈ ఒక్క ఒప్పందం విలువ రూ.98వేల కోట్లు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి.. గుజరాత్ లోని అహ్మదాబాద్ మధ్య ఏర్పాటు చేయనున్న తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు మొదలు కానుంది? ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుంది? దీని వల్ల చోటు చేసుకునే పరిణామాలేంటన్న విషయాల్ని చూస్తే..

భారతీయ రైల్వేల రూపురేఖల్ని సమూలంగా మార్చేసే సత్తా బుల్లెట్ ట్రైన్ కు ఉందని చెప్పొచ్చు. అమితమైన వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ల రాకతో.. జీవనవేగం మరింత ముందుకెళ్లటంతో పాటు.. సమయం విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. వివిధ నగరాల మధ్య దూరాన్ని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు భారీగా తగ్గించే అవకాశం ఉంది.

భారత్.. జపాన్ ల మధ్య తాజాగా కుదిరిన బుల్లెట్ ట్రైన్ ఒప్పందాన్నే తీసుకుంటే.. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చి బుల్లెట్ ట్రైన్ పట్టాలు ఎక్కితే పరిస్థితులు పూర్తిగా మారోవటం ఖాయం. అదెలానంటే.. ముంబయి.. అహ్మదాబాద్ నగరాల మధ్య దూరం 505 కిలోమీటర్లు. ఇప్పుడున్న రైళ్లలో ఈ నగరాల మధ్య ప్రయాణ సమయం 8 గంటలు పడుతోంది. అదే.. బుల్లెట్ ట్రైన్ కానీ పట్టాల మీదకు ఎక్కితే.. ఈ ప్రయాణం మూడు గంటల్లోపే పూర్తి అయ్యే అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్ల వేగం గంటకు 300 నుంచి 350 కిలోమీటర్లు. బుల్లెట్ ట్రైన్ సరాసరి వేగంతో చూసుకుంటే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం మూడు గంటల కంటే భారీగా తగ్గే వీలుంది

ఇక.. ఈ ప్రాజెక్టు మొదలు పెట్టిన నాటి నుంచి దాదాపు ఏడేళ్లలో మొత్తం పని పూర్తి అయ్యే అవకాశం ఉంది. షింకన్ సేన్ సాంకేతికతతో రూపొందించే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు.. భద్రతకు మారుపేరుగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తాన్ని అసాధారణ రీతిలో.. అతి తక్కువ వడ్డీ (0.1శాతం)తో ఒక ప్రత్యేక ప్యాకేజీగా భారత్ కు జపాన్ ఇవ్వనుంది.  బుల్లెట్ ట్రైన్ లు భారత్ కు పరిచయం అయితే.. భారత రైల్వేల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News