దశాబ్ధాల భారత్ కల నెరవేరింది..

Update: 2019-01-07 05:47 GMT
దశాబ్ధాలుగా అందని ద్రాక్ష టీమిండియాకు వశమైంది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్లలో తొలి టెస్ట్ సిరీస్ ను భారత్ సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పవచ్చు.  బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలిచి రికార్డులు సృష్టించి చరిత్ర తిరగరాసింది.

సిడ్నీ టెస్ట్ లో ఫాలో ఆన్ లో పడ్డ ఆస్ట్రేలియా కు 5వ రోజు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ ను రద్దు చేశారు. ఇప్పటికే సిరీస్ లో 2-1 తేడాతో టీమిండియా లీడ్ లో ఉండడంతో కోహ్లీ సేన సిరీస్ విజయం సాధించినట్టు ప్రకటించారు. గతంలో 1980 - 1985 - 2003 పర్యటనల్లో భారత్ సిరీస్ ను డ్రా చేసుకుంది. ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ విజయాన్ని మాత్రం దక్కించుకోలేదు. ఆస్ట్రేలియాలో భారత్ ఆడిన 47 టెస్టుల్లో కేవలం 7 విజయాలు మాత్రం భారత్ నెగ్గడం గమనార్హం.

భారత్ చివరి 4వ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో పూజారా - పంత్ సెంచరీలతో 622/7 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో కులదీప్ యాదవ్ 5 వికెట్లతో విజృంభించడంతో 300 పరుగులకు ఆలౌట్ అయ్యి ఫాలోఆన్లో పడింది. ఫాలో ఆన్ మొదలు పెట్టగా 4 - 5 వరోజుల్లో వర్షం - వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ ను డ్రాగా ఎంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉండడంతో భారత్ టెస్ట్ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ నాలుగు టెస్టుల సిరీస్ లో అత్యధికంగా 521 పరుగులతో పుజారా టాప్ స్కోరర్ గా నిలవగా.. 21 వికెట్లతో బూమ్రా అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.


Full View

Tags:    

Similar News