సోషల్ మీడియా ఇప్పుడు దేశభక్తితో ఊగిపోతోంది. ఫేస్ బుక్ - వాట్సాప్ - ట్విట్టర్ ఇలా అన్నిట్లోనూ దేశ భక్తి మెసేజిలే కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇండియన్ ఆర్మీ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ చేసిన కొన్ని విన్యాసాలూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పారా ట్రూపర్స్ - కమాండర్లు - మంచు కొండల్లో ట్రెక్కింగ్ చేస్తున్న జవాన్ల వీడియోలతో పాటు మహిళా సైన్యం చేస్తున్న విన్యాసాలకు చెందిన ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
నిత్యం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పహారా కాసే మన సైనికులు ఎంత కఠోరంగా శ్రమిస్తారన్నది ఆ వీడియోలను చూస్తే అర్థమవుతోంది. దాంతో అవి చూసినవారు ఆశ్చర్యచకితులవుతున్నారు. బరువైన టైర్లు మోస్తూ - హెలికాప్టర్ల నుంచి సముద్రంలోకి దూకుతూ - బురదలో పాకుతూ - శత్రువులను చంపేందుకే శిక్షణ పొందినట్టున్న ఇండియన్ పారాట్రూపర్స్ వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
మరోవైపు తాజా పరిస్థితులకు సంబంధించిన అప్ డేట్స్ కూడా సోషల్ మీడియాలో వెంటనే షేర్ అవుతున్నాయి. ఉగ్రదాడులు - సైనికుల ప్రతిఘటన వంటివన్నీ ఎప్పటికప్పుడు సమాచారం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి బారాముల్లా సమీపంలోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసిన ఉగ్రవాదులు జీలం నదిలో దూకి పారిపోతుండటాన్ని సైన్యం పసిగట్టడం.. వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఆర్మీ కమాండోలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారన్న విషయం కూడా సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు చేరిపోయింది.
కాగా ప్రస్తుతం జీలం నదిలో మన సైన్యం స్పీడ్ బోట్లతో తిరుగుతూ ఉగ్రవాదుల కోసం గాలిస్తోంది. ఉగ్రవాదులు వినియోగించిన జీపీఎస్ - కాంపాస్ - ఫెన్సింగ్ కట్టర్ - ఏకే 47 మ్యాగజైన్ లను దాడి జరిపిన ప్రాంతంలోనే వదిలి వీరు పరారుకాగా - వాటన్నింటినీ సైన్యాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని వివరాలను బట్టి ఉగ్రవాదులు పాక్ నుంచే చొరబడ్డారని గుర్తించారు. ఇక వీరు తెల్లవారుఝామున తప్పించుకుని పారిపోయినట్టు గుర్తించిన సైన్యం - జీలం నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లోని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో వారు నది మార్గంలో పాక్ వైపు వెళుతున్నారని గుర్తించి ఛేజ్ ప్రారంభించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/