దేశంలో అమాయకుల ప్రాణాలు తీస్తూ.. రక్తపుటేరులు పారించేలా విద్రోహ చర్యలకు పాల్పడే అంతర్జాతీయ స్మగ్లర్.. ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడైన దావూద్ ఇబ్రహీం విషయంలో భారత సర్కారు ఏ విధంగా వ్యవహరించింది. అతడి విషయంలో భారత సర్కారు అనుసరించి వ్యూహాలపై ఇప్పటివరకూ ఊహాగానాలే తప్పించి.. ఓపెన్ గా ఒప్పుకోవటాలు.. ఆన్ రికార్డెడ్ గా చెప్పినోళ్లు లేరు.
తాజాగా ఆ కొరత తీరుస్తూ.. మాజీ హోం శాఖ కార్యదర్శి.. బీజేపీ నేత అయినా ఆర్కే సింగ్ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలనాత్మక అంశాల్ని చెప్పుకొచ్చారు. దావూద్ ను లేపేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు జరిగినట్లుగా చెప్పిన ఆయన.. అందుకు ప్రధాని వాజ్ పేయ్ గా ఉన్నప్పుడు ప్రయత్నం చేశారన్నారు. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా అజిత్ డోవెల్ పని చేసిన సమయంలో ప్లాన్ చేశారని.. ఇందుకోసం చోటా రాజన్ ముఠాకు చెందిన సభ్యులకు రహస్యంగా శిక్షణ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ కోవోర్ట్ ఆపరేషన్ విషయం పోలీసుశాఖకు చెందిన ఉన్నతాధికారులు కొందరు దావూద్ కు అత్యంత సన్నిహితులని.. వారు ఈ విషయాల్ని దావూద్ కు చేరవేయటంతో.. శిక్షణ పొందుతున్న వారిని అరెస్ట్ చేసేలా పావులు కదిపారని చెప్పుకొచ్చారు.
పాక్ లో ఉన్న దావూద్ ను.. అమెరికా కనుక లాడెన్ ఎలా అయితే లేపేసిందో.. అదే తీరులో దావూద్ ను లేపేయాలని ఆర్కే సింగ్ చెప్పుకొచ్చారు. అయితే.. అలాంటి ఆపరేషన్ కారణంగా పాక్.. భారత్ మీద దాడి చేసే వీలుందని.. అందుకే భారత్ వెనక్కి తగ్గుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ పాకిస్థాన్ కానీ.. నిజంగా యుద్ధానికి దిగితే.. ఆ దేశాన్ని ఎదుర్కొనే శక్తి భారత్ కు ఉందని.. మనల్ని ఎదుర్కొనే శక్తి పాక్ కు లేదని.. అయినా.. పాక్ అందుకు సిద్ధం అవుతుందని తాను భావించటం లేదని ఆర్కే సింగ్ వెల్లడించారు. గుట్టుగా చేసే పనుల గురించి సీదీ బాత్ అంటూ చెప్పేయటం మర్మమేమిటో ఆర్కేసింగ్ కే తెలియాలి. ఇలా బాహాటంగా ఇంటర్వ్యూలు ఇచ్చి.. ఎప్పటికి దెబ్బేసే అవకాశాన్ని లేకుండా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం వ్యక్తమవుతోంది.